Top B.Tech Trades: ఈ ట్రేడ్‌లలో బి.టెక్ చేస్తే భారీగా జీతాలు.. ఇంకా ఈ ప్రయోజనాలు..!

If you Study B.Tech in these Trades you will Get Huge Salaries and You will Get Many Benefits
x

Top B.Tech Trades: ఈ ట్రేడ్‌లలో బి.టెక్ చేస్తే భారీగా జీతాలు.. ఇంకా ఈ ప్రయోజనాలు..!

Highlights

Top B.Tech Trades: ఇంటర్‌ తర్వాత చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ వైపు మొగ్గు చూపుతారు. అందుకే బి.టెక్‌లో చేరుతారు. ఇందులో చాలా ట్రేడ్‌లు ఉంటాయి.

Top B.Tech Trades: ఇంటర్‌ తర్వాత చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ వైపు మొగ్గు చూపుతారు. అందుకే బి.టెక్‌లో చేరుతారు. ఇందులో చాలా ట్రేడ్‌లు ఉంటాయి. ఎవరి అభిరుచులకి అనుగుణంగా వారు ఆ ట్రేడ్‌లలో చేరుతారు. కానీ కొన్ని ట్రేడ్‌లు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. వీటిని చదవడం వల్ల భారీ జీతాన్ని పొందవచ్చు. జీవితంలో మంచిగా స్థిరపడవచ్చు. అలాంటి కొన్ని బీటెక్‌ ట్రేడ్‌ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

సివిల్ ఇంజనీరింగ్

సివిల్ ఇంజినీరింగ్ చాలా ప్రజాదరణ పొందిన ట్రేడ్‌. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, అవస్థాపన సౌకర్యాల కోసం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది. కాబట్టి ఇందులో బీటెక్‌ చేస్తే ఈ రంగంలో సులువుగా ఉద్యోగం సంపాదించవచ్చు. ఇందులో భారీగా జీతాలు ఉంటాయి. ఇంకా ప్రైవేట్‌గా కూడా పనిచేసుకోవచ్చు.

మెకానికల్‌ ఇంజనీరింగ్‌

మెకానికల్ ఇంజనీర్లకు ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ బ్రాంచ్ టాప్ ట్రేడ్‌లలో ఒకటిగా కొనసాగుతోంది. మెకానికల్ ఇంజనీర్లు థర్మల్ సెన్సార్లు, మెకానికల్ పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ పరీక్షిస్తారు. IIT, NIT, ఏదైనా సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఈ బ్రాంచ్‌లో B.Tech పూర్తి చేసినట్లయితే దేశంలోని ప్రఖ్యాత కంపెనీల నుంచి ఏటా 20 నుంచి 50 లక్షల రూపాయల జాబ్ ఆఫర్ పొందవచ్చు. కెరీర్‌ని ఉన్నతంగా మలుచుకోవచ్చు.

కంప్యూటర్ సైన్స్

నేటి కంప్యూటర్‌ యుగంలో ఈ ట్రేడ్‌కి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. చాలామంది విద్యార్థులు

కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేయడం మొదటి ఎంపికగా భావిస్తున్నారు. ఈ ట్రేడ్‌ చేసినవారు ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ రంగంలో అందమైన సాలరీలు ఉంటాయి. ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మంచి కంపెనీలో జాబ్‌ లభిస్తే కెరీర్‌ని ఉన్నత స్థితికి తీసుకుపోవచ్చు. విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది.

ఏరోస్పేస్ ఇంజనీర్

విమానం, అంతరిక్ష నౌకల అభివృద్ధి, మెయింటెనెన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీర్లు కీలక పాత్ర వహిస్తారు. ఈ రోజుల్లో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం గురించి అందరికి అవగాహన పెరిగింది. ఈ పరిస్థితిలో ఈ రంగంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. భారీ జీతంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories