Study Tips: విద్యార్థులు, నిరుద్యోగులకు అలర్ట్‌.. ఈ 7 అలవాట్లు పాటిస్తే టాపర్‌ మీరే..!

If you follow these 7 Habits you will Stand Topper in this Exam know about them
x

Study Tips: విద్యార్థులు, నిరుద్యోగులకు అలర్ట్‌.. ఈ 7 అలవాట్లు పాటిస్తే టాపర్‌ మీరే..!

Highlights

Study Tips: మీరు విద్యార్థి అయినా ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా కచ్చితంగా కొన్ని పద్దతులు పాటించాలి.

Study Tips: మీరు విద్యార్థి అయినా ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా కచ్చితంగా కొన్ని పద్దతులు పాటించాలి. నిజానికి జీవితంలో చిన్న చిన్న అలవాట్లను పాటించడం వల్ల ఏ పరీక్షలోనైనా సులువుగా విజయం సాధించవచ్చు. ఒక వ్యక్తి తన అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు ఎంచుకున్న రంగంలో సక్సెస్‌ అవుతారు. ఏదైనా పరీక్షలో అగ్రస్థానంలో ఉండాలంటే ఈ 7 ప్రత్యేక అలవాట్లను అనుసరించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. టైమ్ మేనేజ్‌మెంట్

మీరు ఎప్పుడైనా టాపర్‌తో మాట్లాడితే అతను అగ్రస్థానంలో ఉండటానికి చాలా చిట్కాలు చెబుతాడు. అందులో ఒక సాధారణ విషయం ఉంటుంది. అది టైం మేనేజ్‌మెంట్‌. సమయాన్ని తదనుగుణంగా వాడుకుంటే కచ్చితంగా విజయం సాధించవచ్చు.

2. స్మార్ట్ స్టడీ

ఈరోజు నుంచి మంచి ఫలితాలు సాధించాలంటే కష్టపడి పని చేస్తే సరిపోదు. ఇందుకోసం హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అందువల్ల ఉత్తమ ఫలితాలు కావాలంటే ఈ రోజు నుంచే స్మార్ట్ స్టడీపై దృష్టి పెట్టడం ప్రారంభించండి.

3. కొత్తది నేర్చుకోవడం

మీకు ఎల్లప్పుడు కొత్త విషయలు నేర్చుకోవాలనే తపన ఉండాలి. టాపర్ గుర్తింపు ఏంటంటే అతను తన జీవితాంతం నేర్చుకోవడం ఆపడు.

4. సరైన ప్రశ్నలను అడగడం

తరగతిలో ఏదైనా అంశంపై సందేహం వచ్చినప్పుడు ఉపాధ్యాయులను ప్రశ్నించని విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేయలేరు. టాపర్ ఎల్లప్పుడూ తన సందేహాలను సమయానికి క్లియర్ చేసుకుంటాడు. అతని టాపిక్‌పై పూర్తి అవగాహన ఉంటుంది.

5. తప్పుల నుంచి నేర్చుకోవడం

మీరు టాపర్ కావాలంటే మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. భవిష్యత్‌లో వాటిని పునరావృతం చేయకూడదు. ఇతరుల తప్పుల నుంచి నేర్చుకునే వ్యక్తి మాత్రమే భవిష్యత్‌లో విజయం సాధిస్తాడని చెబుతారు.

6. స్వీయ అధ్యయనం

వాస్తవానికి సొంత అధ్యయనంతో ఎలాంటి యుద్ధాన్ని అయినా అధిగమించవచ్చు. సరళమైన భాషలో స్వీయ-అధ్యయనం ద్వారా ఒక వ్యక్తి జ్ఞానం పెరుగుతుంది. ఇది పరీక్షలో మంచి మార్కులు స్కోర్ చేయగల విశ్వాసాన్ని ఇస్తుంది.

7. అర్థం చేసుకోవడంపై దృష్టి

మీరు కంఠస్థం చేయడం అలవాటు చేసుకుంటే తెలివైన వారిలా అవుతారు. చిరాకుకు బదులు జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా సబ్జెక్ట్‌ను సులభంగా అర్థం చేసుకుంటారు. పరీక్షలో సొంత భాషలో సమాధానాలు ఇవ్వడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories