నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంటలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. రూ.1,42,400

IB Recruitment 2023 Notification Out Check For All Details
x

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంటలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. రూ.1,42,400

Highlights

IB Recruitment 2023: నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది.

IB Recruitment 2023: నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ACIO (అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్ ) గ్రేడ్ II 995 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇది జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ 'సి' (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్ట్‌గా తెలిపారు. IB ACIO గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సవాలుతో కూడుకున్నది. 25 నవంబర్ నుంచి 15 డిసెంబర్ 2023 వరకు www.mha.gov.in లేదా www.ncs.gov.in సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

IB ACIO రిక్రూట్‌మెంట్, అర్హతలు

IB ACIO రిక్రూట్‌మెంట్ 2023 కోసం కేంద్ర పోలీసు సంస్థలు లేదా రాష్ట్ర పోలీసు సంస్థలు లేదా రక్షణ దళాల్లో ఉన్న అధికారులు అప్లై చేసుకోవచ్చు. ACIO గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్‌కు అర్హత పొందాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా IB ACIO నోటిఫికేషన్ 2023లో ఇచ్చిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసి ఉండాలి.

జాతీయత- IB రిక్రూట్‌మెంట్ 2023కి అర్హత సాధించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులు అయి ఉండాలి. సంబంధిత డాక్యుమెంట్ రుజువును కలిగి ఉండాలి.

విద్యా అర్హత (15/12/2023 నాటికి)- అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయో పరిమితి- అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే, జనరల్, EWA, OBC (మెయిల్) కోసం దరఖాస్తు రుసుము రూ. 550 చెల్లించాలి. అయితే అన్ని ఇతర కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ. 450గా ఉంటుంది.

IB ACIO 2023 జీతం: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు లెవల్ 7 పే మెట్రిక్యులేషన్ జీతం చెల్లిస్తారు. దాదాపు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది. ప్రారంభంలో నియమించబడిన IB ACIO గ్రేడ్ 2/ఎగ్జిక్యూటివ్ బేసిక్‌ జీతం రూ. 44,900, ఇది ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories