First Job Mistakes: కొత్తగా జాబ్‌లో జాయిన్‌ అయ్యారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయవద్దు..!

Have You Joined A New Job Dont Make These Mistakes
x

First Job Mistakes: కొత్తగా జాబ్‌లో జాయిన్‌ అయ్యారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయవద్దు..!

Highlights

First Job Mistakes: ఈ రోజుల్లో ప్రతి రంగంలో విపరీతమైన పోటీ ఉంది. ఉద్యోగం దొరకడమే కష్టంగా మారింది.

First Job Mistakes: ఈ రోజుల్లో ప్రతి రంగంలో విపరీతమైన పోటీ ఉంది. ఉద్యోగం దొరకడమే కష్టంగా మారింది. దొరికిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నది. ఈ పరిస్థితిలో మీరు కాలేజ్‌ లైఫ్‌ తర్వాత మొదటి ఉద్యోగంలో చేరినట్లయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం అవసరం. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తుల్లో నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్ కల్చర్‌కి తగ్గట్టుగా మారడం వారికి అంత సులువు కాదు. ప్రారంభంలో మీరు మీ ఇమేజ్ బిల్డింగ్, సెల్ఫ్-బ్రాండింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టడం అవసరం. లేదంటే మరొక ఉద్యోగం పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

రెజ్యూమ్‌

కొంతమంది విద్యార్థులు రెజ్యూమ్‌లో వారి అర్హతలను మాత్రమే వివరిస్తారు. రెజ్యూమ్‌ తయారు చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు మీరు సాధించిన అన్ని ముఖ్యమైన విజయాలను అందులో మెన్షన్‌ చేయాలి. ఇంటర్న్‌షిప్ లాంటి వివరాలు పేర్కొనడం మర్చిపోవద్దు. ఇది కాకుండా ఏదైనా సర్టిఫికేట్ కోర్సు చేసినట్లయితే లేదా ఏదైనా అవార్డును గెలుచుకున్నట్లయితే ఆ వివారలు కూడా పొందుపర్చాలి.

కమ్యూనికేషన్ గ్యాప్

కెరీర్ ప్రారంభంలో ఉద్యోగం వచ్చిన వెంటనే చాలా మంది యువత సొంత ట్యూన్‌లో మునిగిపోతారు. సీనియర్లతో సరిగ్గా సంభాషించరు. తర్వాత ఈ అలవాటు దీర్ఘకాలంలో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కార్యాలయంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మెయిల్స్, కాల్స్‌లో భాషను నియంత్రించండి. లేకపోతే సీనియర్లు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది.

ఆఫీస్ కల్చర్

విద్యార్థి జీవితం నుంచి ఆఫీస్ జీవితానికి మారడం ఎవరికీ అంత సులభం కాదు. ఈ వాతావరణానికి అనుగుణంగా మారడానికి సమయం పడుతుంది. మీరు ఆఫీసు సంస్కృతిని ప్రారంభంలోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఆఫీస్ రూల్స్ కు విరుద్ధంగా తప్పులు చేయవద్దు. మీ ప్రవర్తన బాగుంటేనే మీ సీనియర్లు మిమ్మల్ని ఎక్కడికైనా సిఫార్స్‌ చేస్తారని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories