TSPSC: తెలంగాణలో శనివారం గ్రూప్‌ -4 పరీక్ష

Group-4 Exam in Telangana on Saturday
x

TSPSC: తెలంగాణలో శనివారం గ్రూప్‌ -4 పరీక్ష

Highlights

TSPSC: పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన TSPSC

TSPSC: తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష లీకేజీలు మరచిపోకముందే నిరుద్యోగులు మరో పరీక్షకు సిద్ధమవుతున్నారు. శనివారం జరిగే గ్రూప్- 4 పరీక్షకు లక్షల్లో అభ్యర్ధులు హాజరుకానున్నారు. మరోవైపు బయోమెట్రిక్ లేకుండానే పరీక్ష నిర్వహిస్తుండటం పట్ల TSPSCపై విమర్శలు వస్తున్నాయి.

గ్రూప్-4 పరీక్షకు TSPSC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 8వేల180 పోస్టులకు సోమవారం జరగనున్న ఈ పరీక్ష కోసం 9లక్షల 51వేల 321 మంది అభ్యర్ధులు అప్లై చేశారు. మొత్తం 33 జిల్లాల్లో 2వేల 846 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు పేపర్లుగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.

ఉదయం 10గంటల నుంచి 12గంటల 30నిమిషాల వరకు పేపర్- 1...మధ్యాహ్నం 2గంటల 30నిమిషాల నుండి నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 జరుగుతుంది. అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు వచ్చే ముందు ఎలాంటి ఆభరణాలు ధరించరాదని...తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని TSPSC సూచించింది. పరీక్ష సమయం దాటితే ఎవరిని అనుమతించమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

ఈ గ్రూప్‌-4 పరీక్ష పట్ల కూడా అభ్యర్ధులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ లేకుండా పరీక్షను నిర్వహిస్తుండటం పట్ల అభ్యర్ధులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు కూడా బయోమెట్రిక్ లేకుండా పరీక్షని ఎలా నిర్వహిస్తున్నారని TSPSCని ప్రశ్నించింది. అంత మంది అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్ హాజరు కష్టమని అధికారులు చెబుతున్నారు. ఈ బయోమెట్రిక్‌ విధానం సమయం ఎక్కవ తీసుకుంటుందని..దీంతో పాటు ఎక్కడైనా సాంకేతిక సమస్య ఎదురైతే కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. దీంతో అధికారులు హాల్‌టికెట్, ఫోటో లేకుండానే అభ్యర్ధుల OMR షీట్లను సిద్ధం చేస్తున్నారు.

గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ పేపర్‌లీక్‌తో చెడ్డ పేరు మూటగట్టుకున్నTSPSC...గ్రూప్ -4‌ పరీక్షను ఏలా నిర్వహిస్తుందో అన్న అనుమానాలను, అభ్యర్ధులకు ఎలా నివృత్తి చేస్తుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories