Income Tax Recruitment 2023: క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌.. స్పోర్ట్స్ కోటా కింద ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు..!

Good News For Sportspersons Jobs In Income Tax Department Under Sports Quota
x

Income Tax Recruitment 2023: క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌.. స్పోర్ట్స్ కోటా కింద ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు..!

Highlights

Income Tax Recruitment 2023: క్రీడాకారులకు ఇది సువర్ణవకాశం అని చెప్పాలి. గవర్నమెంట్‌ జాబ్‌ సాధించే అవకాశం వచ్చింది.

Income Tax Recruitment 2023: క్రీడాకారులకు ఇది సువర్ణవకాశం అని చెప్పాలి. గవర్నమెంట్‌ జాబ్‌ సాధించే అవకాశం వచ్చింది. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్పోర్ట్స్ కోటా కింద పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబైలోని చీఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ కార్యాలయం ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల నియామకం కోసం ప్రతిభగల క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ incometaxmumbai.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్త ఉద్యోగాలు

14 ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు

18 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II పోస్టులు

119 ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు

మల్టీ టాస్కింగ్ సిబ్బంది 137 పోస్టులు

క్యాంటీన్ అటెండర్ 3 పోస్టులు

ఎలాంటి క్రీడాకారులు అర్హులు

1. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు

2. రాష్ట్ర/UT సీనియర్, జూనియర్ స్థాయి పతక విజేతలు

3. యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో మూడో స్థానం వరకు పతకాలు సాధించిన అభ్యర్థులు

4. రాష్ట్ర పాఠశాల స్థాయిలో జాతీయ క్రీడలు/ఆటల్లో మూడవ స్థానం గెలుచుకున్న అభ్యర్థులు

5. ఫిజికల్ ఎఫిషియెన్సీలో జాతీయ అవార్డును గెలుచుకున్న అభ్యర్థులు

6. రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం/విశ్వవిద్యాలయం/రాష్ట్ర పాఠశాల జట్టులో ఆడిన అభ్యర్థులు

దరఖాస్తుకు విద్యార్హత

ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్/టాక్స్ అసిస్టెంట్ - ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

MTS/క్యాంటీన్ అటెండెంట్- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి

వయస్సు జనవరి 1, 2023 నుంచి లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు - వయో పరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు

స్టెనోగ్రాఫర్, టాక్స్ అసిస్టెంట్ & MTS పోస్టులు - 18 నుంచి 27 సంవత్సరాలు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు - 18 నుంచి 25 సంవత్సరాలు

Show Full Article
Print Article
Next Story
More Stories