Oil India jobs 2024: ఐటీఐ చదివినవారికి శుభవార్త.. ఆయల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. 38 ఏళ్లవారు కూడా అర్హులే..!

Good News For ITI Students 421 Jobs In Oil India Check For All Details
x

Oil India Jobs 2024: ఐటీఐ చదివినవారికి శుభవార్త.. ఆయల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. 38 ఏళ్లవారు కూడా అర్హులే..!

Highlights

Oil India Jobs 2024: ఐటీఐ చదివిన వారికి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకుంటే ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి బంపర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

Oil India Jobs 2024: ఐటీఐ చదివిన వారికి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకుంటే ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి బంపర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఆయిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో వర్క్ పర్సన్ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారుల వయోపరిమితి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితి SC/ST అభ్యర్థులకు 38 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 36 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 30 జనవరి 2024 చివరితేదీగా చెప్పారు.

ఈ రిక్రూట్‌మెంట్ కింద జనరల్ కేటగిరీ యువత 200 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అయితే SC, ST, EWS, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. అదే సమయంలో వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉంటాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్‌లో చెక్ చేయవచ్చు. అభ్యర్థులు కింది ట్రేడ్‌లలో పాసై ఉండాలి.

ITI

ఫిట్టర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ మెకానిక్ డీజిల్

ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ వెల్డర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్

ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఎలక్ట్రానిక్స్

మెకానిక్ ట్రేడ్ మెకానిక్

మోటార్ వెహికల్ ట్రేడ్

సర్వేయర్ ట్రేడ్

IT&ESM/ICTSM/IT ట్రేడ్

ఆయిల్ ఇండియా మొత్తం 421 వర్క్ పర్సన్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. సెలెక్ట్‌ అయిన అభ్యర్థుల నెలవారీ జీతం పే స్కేల్ గ్రేడ్ III కింద వచ్చే వ్యక్తికి నెలకు రూ.26,600 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది. గ్రేడ్ V పే స్కేల్ కింద వచ్చే పోస్టుల అభ్యర్థులు ప్రతి నెలా రూ.32,000 నుంచి రూ.1,27,000 వరకు జీతం పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories