FCI Recruitment 2022: నిరుద్యోగులకి అలర్ట్‌.. FCIలో ఈ పోస్టులకు అప్లై చేశారా..!

FCI Manager Category 2 Recruitment 2022 Notification Released
x

FCI Recruitment 2022: నిరుద్యోగులకి అలర్ట్‌.. FCIలో ఈ పోస్టులకు అప్లై చేశారా..!

Highlights

FCI Recruitment 2022: నిరుద్యోగులకి అలర్ట్‌.. FCIలో ఈ పోస్టులకు అప్లై చేశారా..!

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేటగిరీ 2 మేనేజర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 6 నెలల పాటు శిక్షణ పొంది ఆ తర్వాత అభ్యర్థులను వివిధ విభాగాల్లో మేనేజర్లుగా నియమిస్తారు. కాబట్టి అభ్యర్థులకు ఇది మంచి సువర్ణవకాశం అని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు FCI రిక్రూట్‌మెంట్ 2022 కోసం fci.gov.inలో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26, 2022 చివరితేది.

నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ కింద జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ సహా వివిధ సబ్జెక్టుల కింద మొత్తం 113 పోస్టులను భర్తీ చేస్తున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థికి నెలకు రూ.40,000 స్టైఫండ్ లభిస్తుంది. మేనేజ్‌మెంట్ ట్రైనీలకు ఆరు నెలల శిక్షణ వ్యవధిని విజయవంతంగా పూర్తిచేయాలి.

అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. మరోవైపు SC, ST, ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. మరోవైపు SC ST కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, రిజర్వ్‌డ్ కేటగిరీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 13 ఏళ్లు సడలింపు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories