Teacher Jobs 2023: నిరుద్యోగులకి బంపర్‌ ఆఫర్.. 38,800 టీచర్‌ జాబ్స్‌..!

EMRS Recruitment 2023 38800 Posts Will be Recruited in Eklavya Model Schools Check for all Details
x

Teacher Jobs 2023: నిరుద్యోగులకి బంపర్‌ ఆఫర్.. 38,800 టీచర్‌ జాబ్స్‌..!

Highlights

Teacher Jobs 2023: నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది.

Teacher Jobs 2023: నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న 38 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది. ఈ రిక్రూట్‌ మెంట్‌ కింద 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించనున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రకటించారు. భారతదేశం అంతటా గిరిజన విద్యార్థుల కోసం మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రూపొందించడానికి 1997-98లో EMRS పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దేశంలో 2013-14లో 119 ఉన్న పాఠశాలల సంఖ్య మోదీ ప్రభుత్వ హయాంలో 2023-24 నాటికి 401కి పెరిగిందని కేంద్ర మంత్రి ముండా తెలిపారు. ఈ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య 2023-14లో 34,365 ఉండగా 2023-24 నాటికి 1,13,275కి పెరిగింది. 2025-26 నాటికి దేశవ్యాప్తంగా గుర్తించబడిన 740 బ్లాకుల్లో EMRS ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే మూడేళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు.

భర్తీ చేయనున్న పోస్టులు

ప్రిన్సిపాల్ - 740 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్ - 740 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 8140 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్) – 740 పోస్టులు, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ – 8880 పోస్టులు, ఆర్ట్ టీచర్ – 740 పోస్టులు, మ్యూజిక్ టీచర్ – 740 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 1480 పోస్టులు, లైబ్రేరియన్ - 740 పోస్టులు, స్టాఫ్ నర్స్ - 740 పోస్టులు, అకౌంటెంట్ - 740 పోస్టులు, హాస్టల్ వార్డెన్ - 1480 పోస్టులు, క్యాటరింగ్ అసిస్టెంట్ - 740 పోస్టులు, చౌకీదార్ - 1480 పోస్ట్‌లు, కుక్ - 740 పోస్ట్‌లు, కౌన్సెలర్ - 740 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 1480 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ - 740 పోస్టులు, మెస్ హెల్పర్ – 1480 పోస్ట్‌లు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 740 పోస్టులు, స్వీపర్ - 2220 పోస్టులు ఉన్నాయి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే జూన్ 7, 2023న EMRSలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారిక వెబ్‌సైట్ emrs.tribal.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories