DRDO Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌.. డీఆర్డీవోలో 204 పోస్టులు.. అర్హులెవరంటే..?

DRDO Has Released A Notification For Filling Up 204 Scientist-B Category Posts
x

DRDO Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌.. డీఆర్డీవోలో 204 పోస్టులు.. అర్హులెవరంటే..?

Highlights

DRDO Jobs: నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్‌డీవో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 204 సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది.

DRDO Jobs: నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్‌డీవో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 204 సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.drdo.gov.in సందర్శించి అప్లై చేసుకోవచ్చు. చివరి తేది సెప్టెంబర్‌ 29గా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మొత్తం పోస్టులు 204

డీఆర్డీఓ మెయిన్ 181

డీఎస్టీ విభాగం 11

ఏడీఏ 06

సీఎంఈ విభాగం 06

అర్హతలు..

దరఖాస్తుదారులు సంబంధిత ఫీల్డ్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్) తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. ఈ సమాచారాన్ని అప్లికేషన్ ఫారమ్‌లో తప్పనిసరిగా ఫిలప్‌ చేయాలి. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, వేదిక వివరాలను అభ్యర్థులకు ప్రత్యేక కాల్ లెటర్‌ ద్వారా పంపుతారు.

జీతం..

డీఆర్‌డీవో సైంటిస్ట్-బి రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.56,100 నుంచి 1,77,500 మధ్య ఉంటుంది. అప్లై చేయడానికి ముందుగా డీఆర్‌డీవో అధికారిక పోర్టల్ www.drdo.gov.inను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి అడ్వటైజ్‌మెంట్ నంబర్ 145 క్లిక్ చేసి సైంటిస్ట్-బి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి. తరువాత అప్లై నౌ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి నోటిఫికేషన్‌ పూర్తిగా పరిశీలిస్తే అన్ని వివరాలు తెలుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories