Collector Job: కలెక్టర్‌ జాబ్‌తో అధికారం, హోదా మాత్రమే కాదు.. ఇంకా ఈ ప్రభుత్వ సౌకర్యాలు కూడా..!

Collector Job Comes With Authority And Status Also Know About Government Allowances And Facilities
x

Collector Job: కలెక్టర్‌ జాబ్‌తో అధికారం, హోదా మాత్రమే కాదు.. ఇంకా ఈ ప్రభుత్వ సౌకర్యాలు కూడా..!

Highlights

Collector Job: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ద్వారా వచ్చే కలెక్టర్‌ జాబ్‌ చాలా గొప్పది.

Collector Job: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ద్వారా వచ్చే కలెక్టర్‌ జాబ్‌ చాలా గొప్పది. దేశ వ్యాప్తంగా టాప్‌ ర్యాంకుల్లో ఉండే వారికి ఈ ఉద్యోగం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కలెక్టర్‌గా ఎంపికైతే అధికారం, హోదాతో పాటు ప్రభుత అలవెన్సులు, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. అయితే దీనికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కలెక్టర్లు వారికి పోస్టింగ్‌ ఇచ్చిన జిల్లాల్లో భూ రెవెన్యూ వ్యవస్థ, అన్ని రకాల ప్రభుత్వ పన్నుల నిర్వహణకి బాధ్యత వహిస్తారు. కలెక్టర్ జీతం, ఉద్యోగ వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఇతర ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే కలెక్టర్ జీతం 7వ కేంద్ర పే కమిషన్‌ను అనుసరించి ఉంటుంది. జిల్లా కలెక్టర్‌కు జిల్లా మేజిస్ట్రేట్‌తో సమానమైన అధికారం, స్థానం ఉంటుంది. జిల్లా కలెక్టర్ పే స్కేల్ జిల్లా మేజిస్ట్రేట్ పే స్కేల్‌తో సమానంగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ఎం

ట్రీ లెవల్ జీతం రూ. 56,100 నుంచి రూ.1,32,000 వరకు ఉంటుంది. క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్లినప్పుడు రూ. 2,50,000 వరకు ఉంటుంది.

కలెక్టర్ అలవెన్సులు, ఇతర సౌకర్యాలు

ప్రతి ఆరు నెలలకు ద్రవ్యోల్బణం ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ వస్తుంది. వైద్య చికిత్స సమయంలో మెడికల్‌ లీవ్‌ లభిస్తుంది. కలెక్టర్‌కి వ్యక్తిగతంగా డ్రైవర్‌ని కేటాయిస్తారు. భద్రత కోసం 3 హౌస్ గార్డులు, 2 అంగరక్షకులు ఉంటారు. ఇష్టానుసారం సొంత భద్రతా ఏర్పాట్లు చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. నగరాన్ని బట్టి HRA చెల్లిస్తారు. అధికారిక నివాసాన్ని ఉపయోగించని అధికారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

కలెక్టర్ అధికారిక నివాసానికి ఉచిత విద్యుత్ లేదా సబ్సిడీ లభిస్తుంది. కలెక్టర్ల అనుకోని ప్రయాణాలకి ప్రయాణ భత్యాన్ని పొందుతారు. రాష్ట్ర రాజధానిలో నివాసం కాకుండా కలెక్టర్ సర్వీస్ క్వార్టర్‌ను పొందుతాడు. మూడు BSNL SIM కార్డ్‌లు, ఉచిత టాక్ టైమ్, SMS, ఇంటర్నెట్‌తో అందిస్తారు. ఇది కాకుండా ఉచిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ సౌకర్యం ఇంట్లో అందుబాటులో ఉంటుంది.

కలెక్టర్ ఉద్యోగ ప్రొఫైల్

రెవెన్యూ పన్ను వసూలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్‌దే. పన్ను సంబంధిత వివాదాలను న్యాయబద్ధంగా పరిష్కరించడానికి సరైన కోర్టు సెషన్‌లను నిర్వహిస్తారు. భూమిని స్వాధీనం చేసుకోవడం, భూ రెవెన్యూ సేకరణలో మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. భూమికి సంబంధించిన పూర్తి వ్యవహారాలకు జిల్లా కలెక్టర్ బాధ్యత వహిస్తాడు. ఆదాయపు పన్ను బకాయిలు, ఎక్సైజ్ సుంకం, నీటిపారుదల బకాయిలు కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories