CLAT Exam: మీరు క్లాట్‌ పరీక్షని రాయాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

CLAT Exam Know how to get Admission Check for all Details
x

CLAT Exam: మీరు క్లాట్‌ పరీక్షని రాయాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Highlights

CLAT Exam: దేశంలోని ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా తీసుకోవాలనుకుంటే కామన్‌ లా అడ్మిషన్‌ టస్ట్‌ (CLAT) అర్హత సాధించాలి.

CLAT Exam: దేశంలోని ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా తీసుకోవాలనుకుంటే కామన్‌ లా అడ్మిషన్‌ టస్ట్‌ (CLAT) అర్హత సాధించాలి. భారతదేశంలో 24 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు LLB డిగ్రీని పొందవచ్చు. CLAT పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మీరు CLAT పరీక్షను రాయాలనుకంటే దీని గురించి మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలి.

CLAT పరీక్ష చట్టానికి సంబంధించినది. ఒక విద్యార్థి దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఇంజనీర్ డిగ్రీని పొందాలంటే IIT పరీక్షలో అర్హత సాధించాలి. అదే విధంగా LLB డిగ్రీని పొందడానికి CLAT పరీక్ష పాసవ్వాలి. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందగలుగుతారు. ప్రైవేట్ న్యాయ విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలల్లో కూడా CLAT మార్కులు అడుగుతారు.

న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కోసం CLAT UG పరీక్ష క్లియర్ చేయాలి. ఇందులో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మీరు BA LLB, BBA LLB, Bsc LLB, B.com LLB డిగ్రీని పొందవచ్చు. సాధారణ కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి BA, B.com లేదా మరేదైనా బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి లా డిగ్రీని అభ్యసించడానికి ఆసక్తి ఉంటే మీరు CLAT PG పరీక్షకు హాజరు కావాలి. దీని కింద మీరు MA LLB, M.com LLB, Msc LLB తదితర కోర్సులు చేయగలుగుతారు. మీరు ఏ కోర్సులో ప్రవేశం కావాలన్నా పరీక్షలో పొందిన మార్కులపై ఆధారపడి ఉంటుంది.

దీని కోసం గరిష్ట వయోపరిమితి ఏదీ లేదు. ఎప్పుడైనా CLAT పరీక్ష రాయవచ్చు. CLAT UG పరీక్ష కోసం 45% కంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. CLAT PG పరీక్ష కోసం ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. సిలబస్‌ ఇతర ప్రభుత్వ పరీక్షలకు ఉండే విధంగానే ఉంటుంది. ఇందులో చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. సమాధానం ఇవ్వడానికి 120 నిమిషాలు కేటాయిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories