City Union Bank Jobs 2023: బ్యాంక్ జాబ్​ చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. సిటీ యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు..!

City Union Bank Jobs Notification 2023 Release Check For All Details
x

City Union Bank Jobs 2023: బ్యాంక్ జాబ్​ చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. సిటీ యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు..!

Highlights

City Union Bank Jobs 2023: బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే సిటీ యూనియన్​ బ్యాంక్​ నుంచి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్​ అయింది.

City Union Bank Jobs 2023: బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఇది సువర్ణవకాశమని చెప్పాలి. ఎందుకంటే సిటీ యూనియన్​ బ్యాంక్​ నుంచి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్​ అయింది. బ్రాంచ్‌ మేనేజర్‌ (స్కేల్ I, II, III), డిప్యూటీ మేనేజర్‌ (స్కేల్ I, II, III) అసిస్టెంట్‌ మేనేజర్‌, బ్రాంచి డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబరు 31లోగా దరఖాస్తు చేస్తుకోవాల్సి ఉంటుంది.

డిగ్రీ, పీజీ అర్హతతోపాటు, సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు అర్హులు. జేఏఐఐబీ/ సీఏఐఐబీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. నిబంధనల ప్రకారం పని అనుభవం ఉండాలి. 24 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎంపిక విధానం అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట; https://www.cityunionbank.com సందర్శించవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి.. ?

1. సిటీ యూనియన్ బ్యాంక్‌ కేరీర్ పేజీ @ https://www.cityunionbank.com/web-page/careers లోకి వెళ్లాలి.

2. ప్రస్తుతం ప్రకటించిన ఉద్యోగ అవకాశాలపై క్లిక్ చేయాలి.

3. అందులో మన అర్హతకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.

4. అర్హత ప్రమాణాలు, కీలక బాధ్యతలను జాగ్రత్తగా పరిశీలించాలి.

5. ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన అనుభవం వివరాలు చూసుకోవాలి.

6. అనంతరం దరఖాస్తుకు సంబంధించిన బటన్‌ను క్లిక్ చేయాలి.

7. ఏ జాబ్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.

8. దీంతో లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.

9. ఇందులో ఇంతకు ముందే లాగిన్ అయి ఉంటే పేరు, పాస్‌వర్డ్‌ను ఎంటర్​ చేయాలి. లేదంటే కొత్త లాగిన్ క్రియేట్ చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories