Best Part Time Jobs: పార్ట్‌టైమ్‌ జాబ్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా.? ఇవి ట్రై చేయండి..

Best Part Time Jobs
x

Best Part Time Jobs: పార్ట్‌టైమ్‌ జాబ్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా.? ఇవి ట్రై చేయండి..

Highlights

Best Part Time Jobs: పార్ట్‌టైమ్‌ జాబ్‌ (Part Time Job) అనగానే చాలా మంది ముందు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే భావనలో ఉంటారు.

Best Part Time Jobs: పార్ట్‌టైమ్‌ జాబ్‌ (Part Time Job) అనగానే చాలా మంది ముందు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే భావనలో ఉంటారు. అయితే కొందరు కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటివి ఉపయోగిస్తున్నారు. అయితే రూపాయి కూడా చెల్లించకుండా కేవలం మీ ట్యలెంట్‌తో మాత్రమే డబ్బులు ఆర్జించే మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి కొన్ని బెస్ట్‌ పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఆప్షన్స్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకునే బెస్ట్‌ ఆప్షన్‌ కంటెంట్‌ రైటర్స్‌. ప్రస్తుతం కంటెంట్‌ రైటర్స్‌కి భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. పొలిటికల్‌ ఏజెన్సీలు మొదలు యాడ్ ఏజెన్సీల వరకు ఫ్రీలాన్సర్‌ కంటెంట్‌ రైటర్స్‌ కోసం చూస్తున్నాయి. ఇంగ్లిష్‌, హిందీతో పాటు చివరికి తెలుగులో కూడా కంటెంట్‌ రైటర్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. మీలోని స్కిల్స్‌ను తెలియజేస్తూ లింక్డిన్‌ వంటి జాబ్‌ పోర్టల్స్‌లో నమోదు చేసుకోవడం వల్ల మీకు కాల్స్ వస్తాయి.

* సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్క సంస్థ మొదలు సినీ, రాజకీయ సెలబ్రిటీల వరకు అకౌంట్స్‌ను రన్‌ చేస్తున్నారు. అయితే వారు అకౌంట్స్‌ను హ్యాండిల్‌ చేసే సమయం లేకపోవడంతో ఈ బాధ్యతను వేరే వారికి అప్పగిస్తుంటారు. వీరినే సోషల్‌ మీడియా ఎక్స్‌పర్ట్స్‌గా చెబుతుంటారు. సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ కంపెనీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ కంపెనీలు ఫ్రీలాన్సర్‌లను పెద్ద మొత్తంలో రిక్రూట్ చేసుకుంటున్నాయి.

* ఇక కరోనా తర్వాత ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనిని మీకు అనుగుణంగా మార్చుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు. మ్యూజిక్‌, డ్రాయింగ్‌, వెబ్‌ డిజైనింగ్, యోగా.. ఇలా మీలో ఉన్న ఏదో ఒక ట్యాలెంట్‌ను నలుగురికి నేర్పిస్తూ లాభాలు ఆర్జించవచ్చు.

* ప్రస్తుతం ట్రాన్స్‌లేటర్స్‌కి కూడా భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సబ్‌టైటిల్స్‌ కోసం ట్రాన్స్‌లేటర్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటున్నారు. ఇవి కూడా ఫ్రీ లాన్సర్‌ కావడం విశేషం. ప్రాజెక్ట్‌ నిడివి ఆధారంగా రెమ్యునరేషన్‌ ఆధారపడి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories