Leaving Job: ఉద్యోగం మానేసేముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..!

Be Sure to Know These Things Before Quitting Your job Otherwise you Will Lose
x

Leaving Job: ఉద్యోగం మానేసేముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..!

Highlights

Leaving Job: కెరీర్‌లో ఎదుగుదలకి మంచి అవకాశం వచ్చినప్పుడు లేదా పాత కంపెనీలో సమస్యల కారణంగా చాలామంది ఉద్యోగాలు మారవలసి ఉంటుంది.

Leaving Job: కెరీర్‌లో ఎదుగుదలకి మంచి అవకాశం వచ్చినప్పుడు లేదా పాత కంపెనీలో సమస్యల కారణంగా చాలామంది ఉద్యోగాలు మారవలసి ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఆలోచనతో ఉంటే కచ్చితంగా కొన్ని విషయాలని గమనించాలి. పాత ఉద్యోగంలో ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని వదిలే ముందు ఖచ్చితంగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం ఉత్తమం. లేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కోపంతో ఉద్యోగం వదలద్దు

మీరు ఎప్పుడైనా బాస్ లేదా సహోద్యోగులపై కోపం తెచ్చుకొని ఉద్యోగం వదిలేయడం మంచిది కాదు. ఇది పాత కంపెనీలో అంతేకాకుండా కొత్త కంపెనీలో మీపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే సీనియర్‌లతో చర్చించాలి. ఆపై ఉద్యోగం మారడం లేదా వదిలివేయడం గురించి ఆలోచించాలి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది.

నోటీసు పీరియడ్‌ పూర్తి చేయండి

మీరు పని చేసే కంపెనీలో నియమాలను అనుసరించి ఉద్యోగం మానేసేముందు నోటీసు పీరియడ్‌ చేయండి. అధికారికంగా బయటికి వెళ్లిపోవడం ఉత్తమం. అప్పుడే మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

మీకిచ్చిన పని పూర్తి చేయండి

మీ లక్ష్యం లేదా ప్రాజెక్ట్ చేతిలో ఉన్నప్పుడు ఆ పనిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగం మానేయండి. దీనివల్ల మీరు పాత కంపెనీతో మంచి సంబంధాలను కొనసాగించవచ్చు.

అందరితో మాట్లాడండి

ఉద్యోగం మానేస్తున్నప్పుడు అందరితో సరిగ్గా మాట్లాడిన తర్వాత ఉద్యోగం వదిలేయండి. మెయిల్ రాయడం లేదా ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడం లాంటివి చేయకూడదు.

వ్యక్తిగత డేటాను తొలగించండి

మీరు పని చేసే కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ID నుంచి మొత్తం డేటాను తొలగించండి. పాత కార్యాలయంలో వ్యక్తిగత విషయాలు లేదా ఫోటోలు, పత్రాలు, మెయిల్ మొదలైన వాటిని ఉంచకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories