Indian Railway Recruitment 2023: రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగం.. పది, ఐటీఐ చేసిన వారికి అవకాశాలు..!

Apprentice Jobs in Indian Railways are Opportunities for 10th and ITI Passers
x

Indian Railway Recruitment 2023: రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగం.. పది, ఐటీఐ చేసిన వారికి అవకాశాలు..!

Highlights

Indian Railway Recruitment 2023: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైన పని.

Indian Railway Recruitment 2023: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైన పని. సంవత్సరాల కొద్ది పోటీ పరీక్షలకి ప్రిపేర్‌ అయి ఉద్యోగం సాధించాల్సి ఉంటుంది. అలాంటిది ఇండియన్‌ రైల్వే పరీక్ష లేకుండా కొన్ని ఉద్యోగాలని అందిస్తుంది. పది, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. భారతీయ రైల్వే ప్రతి జోన్‌లో అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన విడుదల చేసింది. కొన్ని పోస్టులకు గరిష్ట విద్యార్హత 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత కాగా మరికొన్ని పోస్టులకు ఐటిఐ డిగ్రీతోపాటు హైస్కూల్, ఇంటర్మీడియట్‌ను అడుగుతున్నారు.

అప్రెంటిస్‌కి వయోపరిమితి ఎంత?

రైల్వేలో అప్రెంటీస్ కింద 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు యువత దరఖాస్తు చేసుకోవచ్చు. 24 ఏళ్లు పైబడిన యువకులు దరఖాస్తు చేయలేరు. వయస్సును ఎప్పటి నుంచి లెక్కించాలనే ప్రమాణాన్ని రైల్వేలు నిర్ణయిస్తాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

అప్రెంటిస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన జారీ చేసిన రైల్వే జోన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత ప్రమాణాలకు అర్హత ఉన్న యువత ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ ఏమిటి?

అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రైల్వే ఎలాంటి పరీక్షను నిర్వహించదు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు మెరిట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్హత ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

వెస్ట్రన్ జోన్‌ అప్రెంటీస్‌ పోస్టులు

భారతీయ రైల్వేలోని వెస్ట్రన్ జోన్‌లోని అప్రెంటీస్‌ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ 27 జూన్ 2023 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి 26 జూలై 2023 వరకు సమయం కేటాయించారు. అభ్యర్థులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఐటీఐ తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories