తెలంగాణ విద్యార్థులకి బంపర్‌ ఆఫర్.. ఇందులో పాల్గొంటే మీ భవిష్యత్‌ బంగారుమయం..!

Apex Educational Services organizes Telangana’s biggest ‘Education Fair 2022’ in Hyderabad
x

తెలంగాణ విద్యార్థులకి బంపర్‌ ఆఫర్.. ఇందులో పాల్గొంటే మీ భవిష్యత్‌ బంగారుమయం..!

Highlights

తెలంగాణలో అతిపెద్ద ‘ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022’.. అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో..

Hyderabad: తెలంగాణ విద్యార్థులకి అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సువర్ణవకాశం కల్పించింది. భవిష్యత్‌లో ఏ కోర్సు చేయాలో తెలియక తికమక పడుతున్న విద్యార్థులకి దిశానిర్దేశం చేయడానికి 'తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022'ను నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు పాల్గొంటున్నాయి. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఆగస్టు 13 నుంచి రెండు రోజులు జరుగుతుంది. ఈ సందర్భంగా అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ గట్టు, కోర్ ఆర్గనైజింగ్ టీమ్ మెంబర్ జిబి శరత్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వ MLC డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణాలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ ఫెయిర్ 2022 పోస్టర్‌ను ప్రారంభించారు.

తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022కి ఇంపాక్ట్ ఫౌండేషన్, ఆంబిషన్స్ కన్సల్టెన్సీ మద్దతు తెలిపాయి. అలాగే డిజిటల్ కనెక్ట్, డిజిటల్‌ బ్రాండింగ్‌ అండ్‌ PR పార్టనర్‌ HMTV,The hansindia మీడియా పార్ట్‌నర్స్‌గా పనిచేస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది విద్యార్థులకు, ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య అంతరాన్ని తొలగిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ఇలాంటి ఎడ్యుకేషనల్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నందుకు అపెక్స్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు, విద్యాసంస్థలకు మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందన్నారు.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, మెడికల్, ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, ఏవియేషన్, హాస్పిటాలిటీ, మీడియా, యానిమేషన్ వంటి వివిధ కోర్సులను అందించే సంస్థలు, వారి సిబ్బంది పాల్గొంటారు. ఫ్యాషన్ & ఇంటీరియర్ డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీలు & ఎడ్యుకేషనల్ లోన్ ప్రొవైడర్లు కూడా ఉంటారు. అలాగే అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ గట్టు మాట్లాడుతూ.. అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నిర్వహిస్తున్న 11వ ఎడ్యుకాటోనల్ ఫెయిర్ అని తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థల గుమ్మాల వద్దకు తీసుకురావడమే ఏకైక లక్ష్యమన్నారు. ఎడ్యుకేషనల్ ఫెయిర్‌లో స్పాట్ అడ్మిషన్లు, ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022కి ఇంటర్మీడియట్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా స్టూడెంట్స్, విద్యావేత్తలు, తల్లిదండ్రులు & EAMCET/ICET/ECET/ PGECET రాసిన విద్యార్థులు హాజరుకావొచ్చు. అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా వివిధ న్యూస్ ఛానెల్‌లతో 15 కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లను నిర్వహించింది. కోర్ ఆర్గనైజింగ్ టీమ్ మెంబర్ జిబి శరత్ మాట్లాడుతూ, "ఎడ్యుకేషనల్ ఫెయిర్ అనేది విద్యార్థులు, విద్యా సంస్థల కోసం నిర్వహిస్తున్న వేదిక. విద్యార్ధులు, సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. అనేక ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కోర్సులు, ఫీజులు, వాటి ఎంపిక విధానంపై అవగాహన కల్పించడం మా ప్రధాన లక్ష్యం" అన్నారు.

"అపెక్స్ భారతదేశంలోని వివిధ ప్రధాన రాష్ట్రాల నుంచి అనేక విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మేనేజ్‌మెంట్ కళాశాలలచే అధికారం పొందింది. అపెక్స్ వృత్తిపరంగా అనుభవజ్ఞులైన కౌన్సెలర్లు, సిబ్బందిచే నిర్వహించబడుతుంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022కి ఉచితంగా హాజరుకావచ్చు. వెంటనే www.apexeduservices.comలో నమోదు చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories