AP Inter Results: ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు.. సాయంత్రం 5 గంటలకు రిజల్ట్స్

AP Intermediate Results 2023 to Released on April 26th Evening 5 PM
x

AP Inter Results: ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు.. సాయంత్రం 5 గంటలకు రిజల్ట్స్

Highlights

AP Inter Results: ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స

AP Inter Results: ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నట్లు బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లతోపాటు ఇతర మీడియా వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయ‌ర్ గాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను రాష్ట్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 15 న ప్రారంభమై ఏప్రిల్ 3న ముగియగా.. సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 16న ప్రారంభమై.. ఏప్రిల్‌ 4న ముగిశాయి.

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10 లక్షల 3 వేల 990 మంది హాజ‌రయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9 లక్షల 20 వేల 552 మంది రెగ్యులర్‌, 83 వేల 749 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories