AP Inter Admissions 2022: జూన్‌ 20 నుంచి ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు.. క్లాసులు ఎప్పటి నుంచంటే..?

Andhra pradesh inter first year 2022-23 Admissions from June 20
x

AP Inter Admissions 2022: జూన్‌ 20 నుంచి ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు.. క్లాసులు ఎప్పటి నుంచంటే..?

Highlights

AP Inter Admissions 2022: రేపటి నుంచి (జూన్‌ 20) ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్స్‌ ప్రారంభమవుతున్నట్లు ఇంటర్‌ బోర్డు (BIEAP)సెక్రటరి శేషగిరి బాబు తెలిపారు.

AP Inter Admissions 2022: రేపటి నుంచి (జూన్‌ 20) ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్స్‌ ప్రారంభమవుతున్నట్లు ఇంటర్‌ బోర్డు (BIEAP)సెక్రటరి శేషగిరి బాబు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాలల్లో తొలి ఏడాది ప్రవేశాల కోసం షెడ్యూల్ ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు జులై 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఇంటర్‌ ప్రవేశాలు పదో తరగతి మార్కుల ఆధారంగా, రిజర్వేషన్‌ ప్రకారం చేపట్టనున్నట్లు తెల్పింది. రెండో విడతలో మిగిలిన సీట్లను జనరల్‌గా మార్చి ప్రవేశాలు కల్పిస్తారు. సెక్షన్‌కు 88 మంది విద్యార్ధుల చొప్పున సీట్లు ఇవ్వనున్నారు. ఐతే వొకేషనల్‌, పారామెడికల్‌ కోర్సులకు మాత్రం ఒక సెక్షన్‌కు 30 మందిని కేటాయిస్తారు. ప్రతి కాలేజీ బయట మొత్తం సీట్లు, భర్తీ అయినవి, మిగిలిపోయిన సీట్లకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంటాయి.

కాగా, ఈ నెల తొలి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 4 లక్షల 14 మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 6.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీనిపై కొన్ని విమర్శలు రావడంతో సప్లిమెంటరీ పరీక్షలను సైతం ప్రభుత్వం వేగంగా నిర్వహిస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, కోఆపరేటివ్‌, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, మోడల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ అన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories