రేపే టెట్ ప‌రీక్ష‌.. ఈ స‌మ‌యం త‌ర్వాత వ‌స్తే నో ఎంట్రీ.. అభ్యర్థులకు కీలక సూచనలు..

All Arrangements Set For Telangana TET Exam 2022
x

రేపే టెట్ ప‌రీక్ష‌.. ఈ స‌మ‌యం త‌ర్వాత వ‌స్తే నో ఎంట్రీ.. అభ్యర్థులకు కీలక సూచనలు..

Highlights

TS TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ రేపు ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగనుంది.

TS TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ రేపు ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగనుంది. ఈ పరీక్ష నిర్వహణకుగానూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామ్‌ను బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతోనే రాయాల్సి ఉంటుందని, అభ్యర్థులు రెండు పెన్నులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష ముగిసే వరకూ అభ్యర్థులంతా పరీక్షా హాల్లోనే ఉండాలని, మధ్యలో బయటికి వెళ్లేందుకు అనుమ‌తి లేద‌న్నారు.

ఆదివారం నిర్వ‌హించే టెట్‌ ప‌రీక్ష‌కు ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా నిర్ధేశిత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పేప‌ర్-1 ఉదయం 9:30 గంటలు, పేప‌ర్‌-2 మధ్యాహ్నం 2 :30 గంటల తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories