నిరుద్యోగులకి అలర్ట్‌.. కేంద్ర ప్రభుత్వ స్కూల్‌లో టీచింగ్‌ జాబ్స్‌.. పలు సబ్జెక్ట్‌లలో ఖాళీలు..!

AEC Recruitment 2023 Atomic Energy Central School Notification Check for all Details
x

నిరుద్యోగులకి అలర్ట్‌.. కేంద్ర ప్రభుత్వ స్కూల్‌లో టీచింగ్‌ జాబ్స్‌.. పలు సబ్జెక్ట్‌లలో ఖాళీలు..!

Highlights

Teaching Jobs 2023: నిరుద్యోగులకి అలర్ట్‌..అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Teaching Jobs 2023: నిరుద్యోగులకి అలర్ట్‌..అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. 2023-24 ఏడాదికి గాను కాంట్రాక్ట్ విధానంలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ (తెలుగు), టీజీటీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, పీఈటీ, ఆర్ట్) ఉద్యోగాలని భర్తీ చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డీఈఎల్‌ఈడీ, డిగ్రీ, బీఈడీ పాస్ అయి ఉండాలి.

ప్రిపరేటరీ టీచర్‌, పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్లు, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ప్రిపరేటరీ టీచర్, పీఆర్‌టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21250, టీజీటీ పోస్టులకు రూ.26250 సాలరీ చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్‌ కాపీలను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్‌, డి-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్‌ పోస్ట్, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 21-02-2023. పూర్తి వివరాల కోసం ఒక్కసారి నోటిఫికేషన్‌ పరిశీలించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories