West Bengal rape case : కోల్‌కతా హత్యాచారం కేసులో దోషికి మరణ శిక్ష

West Bengal Siliguri Court Verdict Death Sentence for Rape Murder Convict
x

West Bengal rape case : కలకత్తా అత్యాచారం..హత్య కేసు నిందితుడికి మరణ శిక్ష

Highlights

West Bengal rape case :మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసిన కేసులో దోషికి పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది.

West Bengal rape case : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన నేరస్తుడు ఎండి అబ్బాస్‌కి పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. గత ఏడాది ఈ ఘటన జరిగింది. తాజాగా ఈ కేసులో తీర్పును కోర్టు వెలువరించింది.

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి బెంగాల్‌లోని సిలిగురి కోర్టు మరణశిక్ష విధించింది కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసులో న్యాయం జరగాలంటూ డిమాండ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వార్తకి ప్రాధాన్యత సంతరించుకుంది.

నేరస్తుడికి మరణశిక్ష విధించాలని గతంలో కోర్టును కోరాము. ఎందుకంటే అతడిపై రుజువైన అన్ని సెక్షన్లలోనూ మూడు సెక్షన్స్‌కి ఉరిశిక్ష వర్తిస్తుంది. ఇదే విషయంపై గంటన్నర పాటు వాదనలు జరిగాయి. ఇది చాలా అరుదైన కేసు అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ తెలిపారు. సెక్షన్ 302, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద మరణశిక్ష విధించారని చటర్జీ తెలిపారు.

33 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిన ప్రాసిక్యూటర్ వాదనలను పరిగణలోనికి తీసుకున్న అదనపు సెషన్స్ జడ్జి అనితా మెహ్రోత్రా మాథూర్ ఈ కేసును ముగించేశారు. 2023, ఆగస్టు 21న స్కూల్‌కు వెళ్తున్న మైనర్ బాలిక సిలిగురి మాటిగర పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురయ్యింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేరం జరిగిన 6 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడింది. ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను పోలీసులు ఏ1 నిందితుడి కింద అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories