జాగ్రత్త ... పని కోసం వచ్చామని చెప్పి ఇల్లుకే కన్నం వేస్తున్నారు

జాగ్రత్త ... పని కోసం వచ్చామని చెప్పి ఇల్లుకే కన్నం వేస్తున్నారు
x
Highlights

బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చామని ఏదైనా పని కల్పిస్తే చేసుకుంటామని మాయమాటలు చెప్పి అన్నం పెట్టిన ఇంటికే సున్నం కొడుతున్నారు కొందరు కేటుగాళ్ళు..

బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చామని ఏదైనా పని కల్పిస్తే చేసుకుంటామని మాయమాటలు చెప్పి అన్నం పెట్టిన ఇంటికే సున్నం కొడుతున్నారు కొందరు కేటుగాళ్ళు.. ఎలాంటి పనైనా చేస్తామని ఇంటి ఓనర్స్ కి తమ మీదా నమ్మకం కలిగేలా చేసుకొని అ తర్వాత మంచి అవకాశం దొరకగానే పక్కా స్కెచ్ తో ఇంట్లోని బంగారం , డబ్బుతో ఉడాయిస్తారు. ఇలాంటి వారిని నమ్మవద్దని సైబరబాద్ పోలీసులు చెబుతున్నారు .

భార్యభర్తలు జాబ్ చేయడం , మంచి రిచ్ మనుషుల ఇంటిని టార్గెట్ చేసుకొని వీరు పనిలోకి దిగుతారు . పనిలో చేరాక యజమానులకు వారి మీదా నమ్మకం కలిగేలా చేసుకుంటారు . అ తర్వాత ఇంట్లో ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయో గమనిస్తారు . ప్లాన్ కి మంచి టైం దొరకగానే అన్ని తీసుకొని పారిపోతారు .గతంలో అనీషా అనే ఓ మహిళా బతుకుదెరువు కోసం వైజాగ్ నుండి హైదరాబాదు కి వచ్చింది . కూకట్పల్లి లోని ఓ వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా చేరింది . యజమానికి మంచి నమ్మకం కలిగాక రూపాయలు నాలుగు లక్షలతో పారిపోయింది . ఈ సంఘటన 2018 లో చోటు చేసుకుంది .

పూర్తి వివరాలు తెలియకుండా ఎవరిని ఇంట్లో పనిలో పెట్టుకోకూడదని చెబుతున్నారు పోలీసులు ... వారిని ఇంట్లో పెట్టుకునే ముందు కనీస జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు .

1. పనిలో చేరేముందు వారి ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ని చెక్ చేయాలి .

2. గతంలో వారు ఎక్కడ పని చేసారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

3. ఇంట్లో సీసీ కెమెరాలు మైంటైన్ చేయాలి .

4. వారిని పూర్తిగా నమ్మి అన్ని పనులు అప్పజేప్పకూడదు .

5. ఇంటిలోని విలువైన తాళాలు బీరువా తాళాలు బయటకు వెళ్లేముందు తీసుకువెళ్తే మంచిది .

6. ఆర్ధిక లావాదేవీల గురించి వారి దగ్గర చర్చించకూడదు

వారిపై ఎలాంటి అనుమానం కలిగిన వెంటనే ఫోన్ చెయ్యాలని సైబర్​ క్రైమ్స్​ డీసీపీ ప్రియదర్శిని చెప్పుకొచ్చారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories