ఆన్‌లైన్ వీడియో గేమ్స్ కోసం: పేటీఎం నుంచి 35 వేలు మాయం చేసిన 8 ఏళ్ల బాలుడు

ఆన్‌లైన్ వీడియో గేమ్స్ కోసం: పేటీఎం నుంచి 35 వేలు మాయం చేసిన 8 ఏళ్ల బాలుడు
x
Highlights

ఉన్నట్టుండి ఒక్కసారి బ్యాంక్ ఖాతాల నుండి రూ. 35వేలు మాయం కావడంతో నెత్తినోరు కొట్టుకున్నాడు. అయితే అకౌంట్ల నుండి పైసలు మాయం అవ్వడం ఏంది అని సక్కగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉన్నట్టుండి ఒక్కసారి బ్యాంక్ ఖాతాల నుండి రూ. 35వేలు మాయం కావడంతో నెత్తినోరు కొట్టుకున్నాడు. అయితే అకౌంట్ల నుండి పైసలు మాయం అవ్వడం ఏంది అని సక్కగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ పైసలు మాయం అవ్వడానికి కారణం గజదొంగలు కాదు 8 సంవత్సరాల మీ కొడుకే అని విచారణలో తెలింది. దీంతో ఒక్కసారిగా నోరుఎల్లబెట్టడం తండ్రి వొంతు అయింది. ఇక వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి పైసలు మాయం అవుతున్నట్లు అనుమానం వచ్చి వెంటనే సంబంధిత బ్యాంకు వెళ్లి బ్యాంక్ అధికారులను గట్టిగా అడ్గా.. ఆన్ లైన్ ట్రాన్సక్షన్ల ద్వారా మీ పైసలు మాయం అవుతున్నాయని తెలిపారు.

వామ్మో ఇది ఏంటి అని సోచయించిన బాధితుడు.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా.. బాధితుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పేరిట పేటీయం అకౌంట్ ఉందని విచారణలో తేలింది. పేటీయం వాలెట్లోకి అకౌంట్ నుంచి డబ్బును ట్రాన్స్ ఫర్ అవుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు. అయితే బాధితుడు మాత్రం తనకు ఎలాంటి అకౌంట్లు లేవ్వు అని చెప్పాడు. అయితే మరీ డబ్బు ఎవరు మాయం చేసి ఉంటారని కుటుంబ సభ్యులను ఆరా తీయగా, బాధితుడి కుమారుడే డబ్బును పేటీయం నుంచి మాయం చేస్తున్నాడని విచారణలో గుట్టరట్టైంది. తన తండ్రి పేరిట పేటీయం అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేశాడు. ఇకేంముంది అప్పటి నుండి డబ్బులు మాయం అవుతున్నట్లు గమనించారు. ఇక అంతేకాదు ఆ డబ్బుతో ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించారు. అయితే దీంతో పోలీసులు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories