భారీ సెక్స్ కుంభకోణం: మధ్యప్రదేశ్లో బాలీవుడ్ బీ గ్రేడ్ హీరోయిన్లతో సెక్స్ రాకెట్! నిందితుల్లో రాజకీయనాయకులు!!

భారీ సెక్స్ కుంభకోణం: మధ్యప్రదేశ్లో బాలీవుడ్ బీ గ్రేడ్ హీరోయిన్లతో సెక్స్ రాకెట్! నిందితుల్లో రాజకీయనాయకులు!!
x
Highlights

మధ్యప్రదేశ్‌‌‎లో భారీ సెక్స్​రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ స్కాంతో సంబంధం ఉన్న బాలీవుడ్​ బీ- గ్రేడ్ హీరోయిన్లతోపాటు రాజకీయ నేతలు, కాలేజ్​అమ్మాయిలు, అధికారులను ట్రాప్​చేసి, ఆపై బెదింపులకు‎ పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

మధ్యప్రదేశ్‌‌‎లో భారీ సెక్స్​రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ స్కాంతో సంబంధం ఉన్న బాలీవుడ్​ బీ- గ్రేడ్ హీరోయిన్లతోపాటు రాజకీయ నేతలు, కాలేజ్​అమ్మాయిలు, అధికారులను ట్రాప్​చేసి, ఆపై బెదింపులకు‎ పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... నిందితులు సీక్రెట్​ వీడియోలు తీసి అధికారుల్ని బ్లాక్​మెయిల్​ చేస్తున్నారన్న ఆరోపణలపై భోపాల్‎​కు చెందిన శ్వేతా జైన్‌‌(48), ఆర్తీ (34), శ్వేతా సునీల్​జైన్​(39), బర్ఖా సోనీ(35) అనే నలుగురు మహిళలతో పాటు కారు డ్రైవర్ ఓం ప్రకాశ్​(34)​, ఓ కాలేజ్ విద్యార్థిని‎​ను సిట్​బృందం బుధవారం అరెస్టు చేసింది. నిందితుల నుంచి రెండు ల్యాప్​టాప్‎​లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిలో 4వేలకు పైగా వీడియోలు, ఆడియోలు, చాటింగ్​ స్క్రీన్​షాట్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. లిస్టులో మాజీ గవర్నర్​, సీఎంల పేర్లు కూడా ఉన్నట్లు తెలిపారు.

మధ్యప్రదేశ్​ ఏడీజీపీ సంజీవ్ షామి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్​ బృందంతో ఈ హనీట్రాప్ బ్లాక్ మెయిలింగ్ ముఠాను బట్టబయలు చేసింది. శ్వేతా స్వప్నిల్​ జైన్​ సూత్రధారిగా ఈ ముఠా భోపాల్​, ఇండోర్​ కేంద్రంగా పనిచేస్తోందని, ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ముఖ్యశాఖల సంబంధించిన అధికారులే వీరి టార్గెట్​గా శ్వేతా జైన్ హనీట్రాప్ చేయిస్తున్నారని బయటపడింది. వీడియోల ఆధారంగా వాటిని ఎక్కడి నుంచి అప్‎​లోడ్ చేశారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సంజీవ్​ వెల్లడించారు.

ఏడీజీపీ సంజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... వీరు ముందుగా టార్గెట్ చేసుకున్న వ్యక్తుల్ని పరిచయం చేసుంటారని, ఆ తర్వాత హోటల్​ లేదా అతిథి గృహానికి అమ్మాయిలను పంపిస్తారిని పోలీసుల తెలిపారు. ఆ తర్వాత లోపల జరుగుతున్న తతంగాన్ని స్పై కెమెరాలు లేదా మొబైల్స్ కెమెరాలతో సీక్రెట్‎​గా వీడియోలను చిత్రీకరిస్తారు. రాజకీయ నాయకులు అధికారులు కోరుకుంటే బాలీవుడ్​ హీరోయిన్లతో కూడా ఏర్పాటు చేయిస్తారని పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్​ మాజీ సీఎం ఓ బిల్డింగ్​ను గిఫ్ట్​గా ఇచ్చారని విచారణలో శ్వేతా జైన్​ వెల్లడించినట్లు ఏడీజీపీ సంజీవ్ కుమార్ తెలిపారు.

అయితే ఈ రాకెట్‎లో బీజేపీ నేతల పేర్లే కమల్ నాథ్ సర్కార్ టార్గెట్ చేసుకొని బయట పెడుతోందని కొందరూ బీజేపీ నాయకులు ఆరోపించారు. దీని స్పంధిచిన కాంగ్రెస్ పార్టీ నేత విశ్రా పోలీసులు ఈ సెక్స్ స్కాండల్ వ్యవహారంలో కాంగ్రెస్ వారిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories