నడిరోడ్డుపై లైవ్ లో తనని అక్కడ తాకి ముద్దు పెట్టిన ఆకతాయికి షాకిచ్చిన రిపోర్టర్
రిపోర్టర్ గా రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్న తనని తాకకూడని చోట తాకి.. ముద్దు పెట్టిన ఆకతాయికి మర్చిపోలేని షాక్ ఇచ్చింది ఓ యువతి.
ఒక ఛానల్ లో లైవ్ నడుస్తోంది. రిపోర్టర్ అక్కడి విషయంపై వివరిస్తోంది. ఈలోపు వెనుకగా ఒక వ్యక్తి వచ్చాడు.. అకస్మాత్తుగా ఆమెకు ముద్దు పెట్టాడు. కట్ చేస్తే.. ఆ రిపోర్టర్ తన ఛానల్ లో లైవ్ పెట్టి మరీ ఆ వ్యక్తి పరువు తీసేసింది. అమెరికాలోని కెంటకీ ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహించిన బోర్బన్ అండ్ బియాండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను కవర్ చేయడానికి వెళ్లిన 'వేవ్ 3' న్యూస్ చానల్ రిపోర్టర్ సారా రివెస్ట్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ కార్యక్రమం సమాచారాన్ని లైవ్‌లో అందిస్తున్న సమయంలో ఎరిక్ గుడ్‌మ్యాన్ అనే వ్యక్తి ఆమె వెనుకే తిరిగాడు. ఆమె పిరుదులను అసభ్యంగా తాకి, ముద్దు పెట్టి వెళ్లిపోయాడు. లైవ్ నడుస్తుండటంతో ఆమె తప్పని సరి పరిస్త్తితిలో నవ్వుతూనే వివరాలను చెప్పడం కొనసాగించింది.
ఒక్కసారి లైవ్ పూర్తయిన వెంటనే నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ, ఆ రిపోర్టర్ అక్కడితో అతగాడిని వదల లేదు. తరువాత అక్కడ నుంచి వెళ్లి స్టూడియోలో చర్చ మొదలు పెట్టింది. పేరులో మంచి (గుడ్) ఉంది కానీ, అతను చాలా చెడ్డ వ్యక్తీ అంటూ అతని నిర్వాకాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఎకి పారేసింది. చర్చలో పాల్గొన్నవారూ ఆ గుడ్ మ్యాన్ లోని బ్యాడ్ పట్ల తీవ్ర అభ్యంతరాన్ని చెబుతూ మాట్లాడారు. దీంతో ఆ ఆకతాయికి షాక్ తగిలింది. ఇంతటితో వదిలిపెత్తలేదామె.. తన తప్పును క్షమించమంటూ పోలీస్ స్టేషన్లో రాసి ఇచ్చిన లెటర్ ను పట్టుకుని లైవ్ లో చదివి వినిపించి ఒళ్ళు కొవ్వుతో ప్రవర్తించిన ఆ ఆకతాయికి జీవితంలో మర్చిపోలేని పాఠాన్ని నేర్పింది. ఇప్పుడు నేట్టింట్లో ఈ విషయం వైరల్ అవుతోంది. ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఆడపిల్లలు అంతా ఇదే ధైర్యంతో ఉంటె, ఆకతాయిలకు ముకుతాడు వేయోచ్చని నెటిజన్లు తమ కామెంట్స్ పెడుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire