స్టీల్‌ వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో సంచలన విషయాలు..

స్టీల్‌ వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో సంచలన విషయాలు..
x
Highlights

స్టీల్‌ వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక విషయాలను హైదరాబాద్‌ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. రాంప్రసాద్‌ మర్డర్‌లో మొత్తం 11మంది...

స్టీల్‌ వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక విషయాలను హైదరాబాద్‌ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. రాంప్రసాద్‌ మర్డర్‌లో మొత్తం 11మంది హస్తముందన్న డీసీపీ శ్రీనివాస్‌... కోగంటి సత్యమే ప్రధాన నిందితుడన్నారు. కోగంటి సత్యంతోపాటు నలుగురు ప్రధాన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.... మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 23కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని, కోగంటి సత్యం పక్కా ప్లాన్‌తోనే రాంప్రసాద్‌ను హత్య చేయించాడని డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. రాంప్రసాద్‌ హత్యకు కిఠాయి ముఠాను వినియోగించిన కోగంటి సత్యం..... హత్యపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశాడని అన్నారు. ఇక హత్యకు ఉపయోగించిన కారు, బైక్‌, 3 కత్తులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories