దుండగుల వేధింపుల నుంచి కాపాడాలని 16 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయిస్తే అండగా నిలవాల్సిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు....
దుండగుల వేధింపుల నుంచి కాపాడాలని 16 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయిస్తే అండగా నిలవాల్సిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విటర్‌లో పోస్టు చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..కాన్పూర్ చెందిన ఓ దినసరి కూలీల కుమార్తెను గత కొద్దిరోజులుగా కొంత మంది దుండగులు లైగింకంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు తట్టుకోలేక బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను సంప్రదించారు. తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన హెడ్ కానిస్టేబుల్ థార్‌బాబు ఆమెను అసభ్యకర ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు గురిచేశారు.
అంతటితో ఆగకుండా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎందుకు ఉంగరం ధరించావు? నెక్లెస్ ఎందుకు ధరించావు? నీవు చదువుకోలేదు.. కానీ ఇవన్నీ ధరించావు? అత్యధికంగా ఆభరణాలు ధరించడం దేనికి? దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఇవి చాలు నీవు ఎలాంటి దానివో అర్థం చేసుకోవడానికి.. అంటూ ఆ హెడ్ కానిస్టేబుల్ బాలికను అవమానపరిచాడు. ఈ సమయంలో తల్లిదండ్రులు కల్పించుకుని మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా వారిని కూడా ఆ పోలీసు తిట్టాడు. ఈ ఘటనంతా బాలిక సోదరుడు మొబైల్‌లో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు సదరు హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ వీడియోను ప్రియాంక గాంధీ ట్విటర్ ద్వారా పోస్టు చేస్తూ యూపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ' రాష్ట్రంలో ఒకవైపు నేరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తున్నారు' అంటూ వైరల్ అయిన వీడియోను ట్వీటర్‌లో పోస్ట్ చేశారు.
छेड़खानी की रिपोर्ट लिखवाने गई लड़की के साथ थाने में इस तरह का व्यवहार हो रहा है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 25, 2019
एक तरफ उत्तर प्रदेश में महिलाओं के खिलाफ अपराध कम नहीं हो रहे, दूसरी तरफ कानून के रखवालों का ये बर्ताव।
महिलाओं को न्याय दिलाने की पहली सीढ़ी है उनकी बात सुनना।
Video credits @benarasiyaa pic.twitter.com/J0FdqBR2Tt
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire