సోని కిడ్నాప్ కేసులో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు

సోని కిడ్నాప్ కేసులో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు
x
Highlights

హయత్‌నగర్‌లో బీ ఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకి ఇంకా తెలియకపోవడం తో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన హయత్ నగర్ పోలీసులు...

హయత్‌నగర్‌లో బీ ఫార్మసీ విద్యార్థిని సోని ఆచూకి ఇంకా తెలియకపోవడం తో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన హయత్ నగర్ పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుడు కోసం గాలింపు ముమ్మరం చేశారు. కిడ్మాప్ చేసిన వ్యక్తి విడయవాడ పాత నేరస్థుడు రవి శేఖర్ గా గుర్తించడం అతని పై పలు కేసులు ఉండడం తో సోని కిడ్నాప్ కేసును త్వరగా ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో యువతి అపహరణ కలకలం రేపుతోంది. ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కిడ్నాపర్ పేరు రవి అని తెలుసుకున్న పోలీసులు అతడిది విజయవాడని గుర్తించారు. గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న రవి శేఖర్ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని తిరుగుతునట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం కర్ణాటకలో సీబీఐ ఆఫీసర్ అని చేప్పి కారు దొంగతనం చేసి అదే కారులో బీఫార్మసీ విధ్యార్థిని సోనిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

రవి శేఖర్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు ఇతని కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. రవి శేఖర్ పై సుమారు గా 50 కి పైగా కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర నేరస్థుడిగా ఇతని పై కంకిపాడు, గుంటూరు పోలీస్ స్టేషన్ లలో క్రిమినల్ రికార్డులు ఉనట్లు తెలుస్తోంది. దృష్టి మల్లించి ప్రజలను మోసం చేయడంలో రవి శేఖర్ దిట్ట అయితే అతడు కిడ్నాప్ చేయడం ఇదే మొదటి సారని పోలీసులు చెబుతున్నారు. రవి పై 2001 నుండి వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.

రవి శేఖర్ నేర చరిత్ర గురించి తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం కిడ్నాప్ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు నాలుగు రోజులుగా కూతురు జాడ తెలియకపోవడంతో సోనీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories