Nirbhaya case: ఆ చీకటి రాత్రిలో అసలేం జరిగింది?

Nirbhaya case: ఆ చీకటి రాత్రిలో అసలేం జరిగింది?
x
Nirbhaya convicts (File Photo)
Highlights

గడ్డ కట్టించే చలి. అర్ధరాత్రి జరిగిన దారుణ ఉదంతం. ఆ నిశీరాత్రిలో నిర్భయ జీవితం తెల్లారిపోయింది. ఆరుగురు కీచకులు బస్సులోనే ఆ యువతిపై సామూహిక...

గడ్డ కట్టించే చలి. అర్ధరాత్రి జరిగిన దారుణ ఉదంతం. ఆ నిశీరాత్రిలో నిర్భయ జీవితం తెల్లారిపోయింది. ఆరుగురు కీచకులు బస్సులోనే ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత అత్యంత పాశవికంగా, హృదయవిదారకంగా రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఈ అనూహ్య ఘటనపై ప్రపంచం ఉలిక్కిపడింది. దేశం భగ్గుమన్నది. అక్కడా ఇక్కడా తేడా లేకుండా ఆ మూల ఈ మూలా బేధం లేకుండా అంతటా అందరూ ఏకమయ్యారు. కేంద్రాన్ని కదిలించారు. నిర్భయ చట్టాన్ని తెచ్చుకున్నారు. నిర్భయ ఘటన జరిగి నేటికి ఏడేళ్లయినా నిందితులకు మాత్రం శిక్షను ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. ఆ చీకటి రాత్రిలో అసలేం జరిగింది?

2012, డిసెంబర్ 16 - అర్థరాత్రి 12 గంటలు దాటాక - దేశ రాజధాని ఢిల్లీలో పాశవిక చర్య - నిర్భయపై మానవమృగాల లైంగిక దాడి.

ఆ నాటి ఘటన ఇంకా కళ్లముందే తిరుగుతూ ఉంది. దేశమంతా ఆమెకు జరిగిన అన్యాయంపై గళమెత్తింది. నిందితులకు శిక్షపడాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం వెంటనే నిర్భయ చట్టాన్ని తెచ్చింది. నిందితులకు ఉరి శిక్షను ఖరారు చేశారు. కానీ ఏడేళ్లు గడిచినా నిందితులకు శిక్ష మాత్రం పడలేదు. షాద్‌నగర్‌లో దిశపై జరిగిన అత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌తో నిర్భయ నిందితుల ఉరి మరోసారి తెరపైకి వచ్చింది.

భారతదేశ చరిత్రలో, రాక్షసులు సైతం సిగ్గుపడే రోజు ఏదైనా ఉందంటే, అది డిసెంబర్ 16, 2012. దేశరాజధాని ఢిల్లీలో దారుణం. పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయపై, ఆరుగురు దుర్మార్గుల దురాగతం. అత్యంత పాశవికంగా నరరూప రాక్షసులు, యువతిపై మానవభంగానికి పాల్పడిన రోజది. నిస్సహాయులైన బాధితురాలు నగ్నంగా ఉన్నస్థితిలో తీవ్రంగా రక్తస్రావం అవుతుండగా, ఎముకలు కొరికే చలి రాత్రిలో, కదులుతున్న బస్సులో నుంచి బయటకు విసిరేసిన ఘోరమది.

ఆమె పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆమె అంతర్గత అవయవాలపై క్రూరంగా దాడి చేశారు. జననాంగంలో పదే పదే ఇనుపచువ్వలు పెట్టడంతో బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైంది. చికిత్స పొందుతూ నిర్భయ తుదిశ్వాస విడిచింది. రాక్షసులతో పోరాడి పోరాడి మగువల తెగువేంటో నిరూపించింది. దేశ రాజధానిలో జరిగిన ఇంతటి ఘోరాతి ఘోర ఘటన ప్రపంచాన్ని మెలిపెట్టి పిండేసింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కోర్టు నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. మిగిలిన మైనర్ బాలుడికి మూడేళ్ల శిక్ష విధించడంతో అది పూర్తి అయిపోయింది. కోర్టులో ఉరిశిక్ష పడిన తరువాత నిందితులు ఉరి శిక్షను తప్పించుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. అంతిమంగా నిర్భయ మౌన రోదనకు న్యాయం జరిగింది. దోషులను ఒకేసారి ఉరి తీయడంతో నిర్భయ కేసు ముగిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories