14 రాష్ట్రాలు.. వేయ్యి కేసులు.. నెల్లూరులో దొరికిపోయాడు !

14 రాష్ట్రాలు.. వేయ్యి కేసులు.. నెల్లూరులో దొరికిపోయాడు !
x
Highlights

నెల్లూరు జిల్లా పోలీసులు అరుదైన ఘనత సాధించారు. 14 రాష్ట్రాల చిక్కకుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగను నెల్లూరు జిల్లా పోలీసులకు పట్టుకున్నారు.

నెల్లూరు జిల్లా పోలీసులు అరుదైన ఘనత సాధించారు. 14 రాష్ట్రాల చిక్కకుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగను నెల్లూరు జిల్లా పోలీసులకు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హరియాణాకు చెందిన సందీప్ ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడతాడని, సందీప్ పై దేశవ్యాప్తంగా వేయికిపైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ఒక్క ఏపీలోనే 47కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నెల్లూరులోని దుర్గ మెట్టలో దొంగతనం చేస్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. తన వద్ద ఉన్న క్లోనింగ్ యంత్రం ద్వారా నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి ఏటీఎంలలో నగదు డ్రా చేసినట్లు వివరించారు. అతని వద్ద నుంచి రూ.7లక్షల నగదును, కారు, ఏటీఎం కార్డు క్లోనింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దాదాపు 14 రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడని వారు తెలపారు. నిందితుడిని అరెస్టు చేయడంతో కీలకంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య అభినందించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తుమని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories