ప్రేమించిన పాపానికి.. బాలిక గుండెలపై తన్ని.. కర్రతో కొట్టి..

ప్రేమించిన పాపానికి..  బాలిక గుండెలపై తన్ని.. కర్రతో కొట్టి..
x
Highlights

పెద్దల మాట విననంటావా అంటూ కర్రతో బాలికఇష్టమొచ్చినట్లు కొట్టాడు. బాలిక రెండు చెంపలపై కొట్టాడు. అక్కడితో ఆగకుండా కాళ్లతో బాలిక గుండెలపై తంతూ చావబాదాడు.

ప్రేమ ఇదో తెలియని కొత్త ప్రపంచం. ప్రేమ అనే ప్రయాణంలో ప్రేమికులు స్వేచ్ఛజీవుల్లా సంచరిస్తుంటారు. ఈ ప్రేమలో వయసుతో పనిలేదు కేవలం మనసు, ఒకరినోకరు అర్ధంచేసుకునే మనసు ఉంటే చాలు. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. తమ పెద్దలు వారి ప్రేమను ఎక్కడ కాదంటారోనని భయపడి తట్టబుట్ట సదరుకొని ఊరు వదిలి వెళ్లిపోతారు. అయితే అక్కడితో ఆగుతుందా.. అంటే లేదు పిల్లా, పిలగాడి బంధువులు వారికోసం ఎక్కడెక్కడో జల్లడపట్టి, ఏ మూలనా ఉన్న కానీ గ్రామ పెద్దల ముందు తీసుకొచ్చి పంచాయితీ పెడతారు. ఇక అందరి ముందు వారిని చావకొడుతారు. తరువాత వారిద్దరిని వీడదీస్తారు ఇది వెండితెరపై చూపించే నెగటీవ్ దృష్యం. కానీ ఇలాంటి ఘటనే మన కల్లకు కట్టినట్లు జరిగిన ఘటన అనంతపురం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నారు. పెద్దలు తమప్రేమను ఎలాగైన తిర్కసరిస్తారని అనుకొని పది రోజుల క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయారు. అయితే ఇరువురి తల్లిదండ్రులు వారిని స్వగ్రామానికి రప్పించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే తరువాత మొళ్లిగా అమ్మాయిపై గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప రెచ్చిపోయాడు. పెద్దల మాట విననంటావా అంటూ కర్రతో బాలికఇష్టమొచ్చినట్లు కొట్టాడు. బాలిక రెండు చెంపలపై కొట్టాడు. అక్కడితో ఆగకుండా కాళ్లతో బాలిక గుండెలపై తంతూ చావబాదాడు. బాలికనే ప్రేమించిన యువకుడిపైనా, బాలిక తండ్రిపై కూడా తన ప్రతాపం వీరంగం చూపించాడు.

అయితే పంచాయితీకి వచ్చిన వందలాదీమంది జనం ఓ సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు తప్పా ఏ ఒక్కరు కూడా కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈ బాగోతం మొత్తాన్ని అక్కడున్న యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే లింగప్ప ఉగ్రరూపం మొత్తం సోషల్ మీడియాకెక్కడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయింది. అయితే ఇంత జరిగినా కానీ అక్కడి నుండి ఎలాంటి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఒక్క ఫిర్యాదు వచ్చికానీ చర్చలు తీసుకుంటాం అని పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories