వివాహిత తో అక్రమసంబంధం.. కట్టేసి కొట్టిన గ్రామస్థులు!

వివాహిత తో అక్రమసంబంధం.. కట్టేసి కొట్టిన గ్రామస్థులు!
x
Highlights

క్షణికమైన ఆనందం కోసం వేసే తప్పటడుగులు ప్రాణం మీదకు తీసుకొస్తాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు విచక్షణని కోల్పోయేలా చేస్తాయి. వివాహేతర సంబంధాలతో జీవితాల్ని...

క్షణికమైన ఆనందం కోసం వేసే తప్పటడుగులు ప్రాణం మీదకు తీసుకొస్తాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు విచక్షణని కోల్పోయేలా చేస్తాయి. వివాహేతర సంబంధాలతో జీవితాల్ని పాడు చేసుకోవడమే కాకుండా ఆ సంబంధాలను కాపాడుకోవాలనే తాపత్రయంతో సొంత వారి ప్రాణాలు తీయడం చూస్తూనే ఉన్నాం. ప్రియుడితో, ప్రియురాలితో హాయిగా గడపడానికి అడ్డుగా ఉన్నారని కట్టుకున్న భార్యనూ, భర్తను మాత్రమే కాదు కన్నబిడ్డలను కూడా కడతేర్చడానికి వెనుకాడడం లేదు కొందరు. అయితే పెళ్లైన యువతితో లేచిపోయిన ఓ యువకుడిని, అతనికి సహకరించిన ఇద్దరు చెల్లెళ్లను పట్టుకుని, చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్థులు. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తార్‌దగ్రి అర్జున్‌కాలనీలో జరిగింది. గ్రామానికి చెందన ముఖేశ్ అనే వ్యక్తి భార్య... కొన్నిరోజుల కిందట తన ప్రియుడితో కలిసి ఊరు వదిలి వెళ్లిపోయింది. భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె కోసం రెండు రోజుల తెలిసిన ఏరియాలు మొత్తం గాలించాడు ముఖేశ్. ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత ఫలానా ఏరియాలో తన భార్య, ఆమె ప్రియుడు ఉన్నారని సమాచారం తెలుసుకున్న అతను... గ్రామానికి తిరిగి వస్తే, విడాకులు ఇచ్చి భార్యను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ అతనికి రాజీ సమాచారం పంపాడు. అది నిజమని నమ్మిన ఆ యువకుడు... తార్‌దగ్రి అర్జున్‌కాలనీకి వచ్చాడు.

తన ఇద్దరు స్నేహితులతో కలిసి అతను, ముఖేశ్ ఇంటి వద్దకు రాగానే చుట్టూ జనం గుమిగూడారు. అతనితో పాటు సాయం చేసిన ఇద్దరు చెల్లెళ్లను కూడా చెట్టుకు కట్టేశారు. తర్వాత ఆమె భర్తతో పాటు బంధువులు, గ్రామస్థులు కలిసి గంటల తరబడి చితకబాదారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి, ఈ దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తితో పాటు ఇద్దరు యువతులను అతిదారుణంగా కొట్టి హింసించిన ఐదుగురిపై కేసు నమోదుచేసిన పోలీసులు... వారిని అరెస్ట్ చేశారు. వారిని కొట్టిన మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి ఏమైంది? ఆమెనేం చేశారనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories