మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం..61 మంది మహిళలను..

మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం..61 మంది మహిళలను..
x
Highlights

మాయమాటలతో పలువురు మహిళలను వంచించి అశ్లీల వీడియోలు తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని...

మాయమాటలతో పలువురు మహిళలను వంచించి అశ్లీల వీడియోలు తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వ్యాపించడంతో బాధిత యువతి ఒకరు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో సెల్‌ఫోన్లను మరమ్మతులు చేసుకుంటూ ఉపాధి పొందే అనిశెట్టి సాయి అనే యువకుడు మాయమాటలతో పలువురు యువతులు, మహిళలను వంచించాడు. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియో తీశాడు. ఫోన్ల మరమ్మతు పనులు నేర్చుకునేందుకు ఈ దుకాణంలో చేరిన మరో యువకుడు ఈ వీడియోలను గమనించి రహస్య వీడియోలను చోరీ చేసి గ్రామంలో మరికొంత మందికి పంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఓ వ్యక్తి ఆ వీడియోలన్నీ సేకరించి వాటి ఆధారంగా బాధ్యుడిని సొమ్ము కోసం డిమాండు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బేరం కుదరకపోవడంతో కొన్ని అశ్లీల వీడియోలను పలు వాట్సాప్‌ గ్రూపుల్లో ఉంచాడు. దీంతో బాధితుల్లో ఓ యువతి మొగల్తూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫోన్లను సీజ్‌ చేశారు పోలీసులు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను నిందితుడు వంచించాడని, ఆ కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories