వివాహిత కథ వింటే విస్తు పోవాల్సిందే.. ఇలాంటి మాయలేడీల పట్ల..

వివాహిత కథ వింటే విస్తు పోవాల్సిందే.. ఇలాంటి మాయలేడీల పట్ల..
x
Highlights

మ్యాట్రిమోనీ , సోషల్ మీడియా ను అడ్డుగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్న వివాహిత కథ వింటే విస్తుపోవాల్సిందే. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టడం , సాఫ్ట్...

మ్యాట్రిమోనీ , సోషల్ మీడియా ను అడ్డుగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్న వివాహిత కథ వింటే విస్తుపోవాల్సిందే. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టడం , సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు వల వేయడం, ట్రాప్ లోపడిన తరువాత లక్షలాది డబ్బులు గుంజడం ఈ కిలాడి లేడీ హాబీ. ఒకరిద్దర్ని కాదు పదుల సంఖ్యలో సాప్ట్ వేర్ ఇంజినీర్లకు నట్టేటా ముంచింది. ఓ బాధితుడి ఫిర్యాదుతో మాయలేడి అసలు స్వరూపం బయటపడింది.

ఈమె పేరు మాళవిక. అడ్డదారిలో డబ్బు సంపాదనకు మ్యాట్రిమోనీ ని ఎంచుకుంది. పేస్ బుక్ లో అందమైన అమ్మాయిలు ఫోటోలు సేకరించి మ్యాట్రిమోనీ లో అప్ లోడ్ చేస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెబుతుంది. లక్షలాది రూపాయలు గుంజి మోసం చేస్తుంది.

అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరుణ్ తో మ్యాట్రీమోనీ ద్వారా మాళవిక పరిచయం చేసుకుంది. తానొక డాక్టర్ నని చెప్పుకుంది. హైదరాబాద్‌లో తమకు చాలా ఆస్తులున్నాయని, వాటిపై కోర్టు కేసులు నడుస్తున్నాయని చెప్పింది. ఆస్తులు కాపాడుకోవడానికి డబ్బులు కావాలని కట్టు కథలు చెప్పి నమ్మించింది. 65 లక్షల రూపాయలు కాజేసి వరుణ్ కు గుడ్ బై చెప్పింది. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు మాళవికను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో విస్మయం కలిగించే విషయాలు బయటపడ్డాయి. ఫ్యామిలీ ప్యాకేజీ తరహాలో మాళవిక కుటుంబం మ్యాట్రిమోనీలో మోసాలకు పాల్పుడుతుంది. మాళవికకు ఆమె భర్త, అత్తమామలు, కొడుకు సహకరిస్తుండడంపై పోలీసులు షాక్ తిన్నారు.

మాళవిక చేతిలో మోసపోయిన మరొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 2017లో అతడికి మాళవిక తానొక డాక్టర్ నని పరిచయం చేసుకుంది. యాక్సిడెంట్ లో తన తల్లిదండ్రులు చనిపోయారని, హైదరాబాద్ లో తమ ఆస్తులపై కోర్టు కేసులు నడుస్తున్నాయని మాయమాటలుచెప్పింది. కోటి రూపాయలు ఇస్తే సమస్యలు పరిష్కరం అవుతాయని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం హాయిగా ఉందామని చెప్పి మోసం చేసింది.

ఎన్నారై మోసం కేసులో మాళవికతో పాటు ఆమె కొడుకును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. విలాసాలకు అలవాటు పాటు మాళవిక ఇలాంటి మోసాలు చేస్తుందని, గతంలో ఆమెపై 3 కేసులున్నాయని తెలిపారు. ఇలాంటి మాయలేడీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories