Doctors strike today : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు..ఏ సేవలు పనిచేస్తాయి? ఏవి పనిచేయవు?

ima doctors protest today for kolkata doctor case justice
x

Doctors strike today : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు..ఏ సేవలు పనిచేస్తాయి? ఏవి పనిచేయవు?

Highlights

Doctors strike today :కోల్ కతా లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు నిరసనగా ఐఎంఏ పిలుపునిచ్చిన దేశవ్యాప్తం సమ్మె అమల్లోకి వచ్చింది. నేడు దేశవ్యాప్తగా వైద్య సేవలు నిలిచిపోయాయి. కొన్ని కీలక విభాగాలు మాత్రమే పనిచేయనున్నాయి.

Doctors strike today: కోల్ కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా వైద్యుల నిరసన ఉద్ధ్రుతం అవుతోంది. దేశంలోని అతిపెద్ద వైద్య సిబ్బంది సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె మొదలుపెట్టింది. దశాబ్దకాలంలోనే అతిపెద్ద సమ్మెగా భావిస్తున్న ఈ స్ట్రైక్ లో ఎన్నో వైద్యసేవలు నిలిచిపోయాయి.

కోల్ కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ 31 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటన కోల్ కతాలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో దేశవ్యాప్తంగా వైద్య వర్గాలు నిరసనలు, సమ్మెలకు దిగాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 24గంటల పాటు సమ్మె చేపట్టనున్నట్లు ఐఎంఏ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి వైద్య వర్గాలు కూడా మద్దతు ప్రకటించాయి.

ఏ సేవలు పనిచేస్తాయి? ఏవి పనిచేయవు?

• శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్త సమ్మెను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.

• ఈ వారాంతంలో చాలా ఆసుపత్రి విభాగాలు బంద్ ఉంటాయి. సాధారణ ఔట్ పేషెంట్ విభాగాలు (ఓపీడీలు), ఎలక్టివ్ సర్జరీలు బంద్ కానున్నాయి.

• ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

• ఏవైనా ఎమర్జెన్సీ వైద్య అవసరాలు తలెత్తితే వాటిని కొనసాగించే విధంగా క్యాజువాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి.

• ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో సహా ఆధునిక మెడిసిన్​ వైద్యులు పనిచేసే అన్ని రంగాలపై ఈ సమ్మె ప్రభావం పడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories