హైదరాబాద్‌లో దారుణం... 9 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన మేనమామ
హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మాధాపూర్ పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. శ్రీనివాస్ ( పేరు మార్చాం) దంపతులు మాధాపుర్ లో నివాసముంటున్నారు. అయితే శ్రీనివాస్ భార్య లక్ష్మీ( పేరు మార్పు చేశాం) సోదరుడు తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు.
సొంత మేనమామే చిన్నారి పాలిట కాలయముడైయ్యాడు. చిన్నారి అలాన పాలనా చూడాల్సిన మేనమామ ఆమెపై కసితీర్చుకున్నాడు. అన్యా పుణ్యం తెలియని 9 ఏళ్ల చిన్నారీని చిదిమేసి తన కామవాంఛ తీర్చుకున్నాడు.
హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మాధాపూర్ పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. శ్రీనివాస్ ( పేరు మార్చాం) దంపతులు మాధాపుర్ లో నివాసముంటున్నారు. అయితే శ్రీనివాస్ భార్య లక్ష్మీ( పేరు మార్పు చేశాం) సోదరుడు తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన చిన్నారి మేనమామను బాలిక దగ్గర ఉంచి శ్రీనివాస్ దంపతులు బయటకు వెళ్లారు. అయితే ఎవరూ లేరని తెలుసుకుని బాలికను మాట్లోకి దించాడు. ఆటలాడుకుందామని చిన్నారిని గదిలోకి తీసుకెళ్లాడు. ఎవరు లేని సమయం చూసుకుని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వారి తల్లిదండ్రులు వచ్చే లోగా అక్కడి నుంచీ పరారైయ్యాడు.
ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రుల దుస్తులపై రక్తపు మరకలు ఉండటం గమనించారు. అయితే ఏం జరిగిందని చిన్నారిని ఆరా తీయగా మామయ్య ఆటాడుకుందామని గదిలోకి తీసుకెళ్లాడని చిన్నారి చెప్పింది. అయితే వెంటనే బాలిక తల్లికి అనుమానం వచ్చి జననాంగాల వద్ద పరిశీలించగా తీవ్ర రక్తస్రావమైట్లు కనిపించింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పాప తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు పోలీసులు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసుల తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire