యువకుడిపై యువతి యాసిడ్ దాడి..

యువకుడిపై యువతి యాసిడ్ దాడి..
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనతో ప్రేమాయణం సాగించి, తర్వాత ముఖం చాటేశాడంటూ ఓ యువతి తన ప్రేమికుడిపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది....

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనతో ప్రేమాయణం సాగించి, తర్వాత ముఖం చాటేశాడంటూ ఓ యువతి తన ప్రేమికుడిపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీవన్‌ఘడ్‌కు చెందిన ఫైజద్‌ అనే 20 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వారిమధ్య విభేదాలు తలెత్తడంతో నెల రోజులుగా ఆమెతో మాట్లాడటం మానేశాడు.

ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చెయ్యడం లేదు. దీంతో సదరు ప్రియురాలి అతని దగ్గరికెళ్లి నిలదీసింది. తనను ప్రేమించి మోసం చేస్తావా అని ప్రశ్నించింది. ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోయిందని, ఇప్పుడ పెళ్లికి నిరాకరిస్తే తన గతేం కాను అని వాపోయింది. ఫైజద్ నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో ఆమె తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతని ముఖంపై చల్లేసింది. ఫైజద్ ముఖం కాలిపోయింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా యాసిడ్‌ దాడికి పాల్పడినందుకు సదరు యువతిని ఐపీసీ సెక్షన్‌ 326ఏ కింద అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories