రాధిక హత్య కేసులో కొత్తకోణం.. హత్యకేసు ఛేదనకు జర్మన్‌ టెక్నాలజీ...

రాధిక హత్య కేసులో కొత్తకోణం.. హత్యకేసు ఛేదనకు జర్మన్‌ టెక్నాలజీ...
x
రాధిక హత్య కేసులో కొత్తకోణం.. హత్యకేసు ఛేదనకు జర్మన్‌ టెక్నాలజీ...
Highlights

ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. రాధికను ప్రొఫెషనల్ కిల్లర్ హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు...

ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. రాధికను ప్రొఫెషనల్ కిల్లర్ హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాధిక హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. కనీసం సాక్ష్యాధారాలు కొంచెం కూడా దొరకకుండా రాధికను హత్య చేసినట్లు తెలుస్తోంది. క్లూస్ సరిగా లేకపోవడంతో దర్యాప్తు విషయంలో పోలీసులు సతమతమవుతున్నారు. ఈ కేసులో సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటన జారీ చేశారు.

కరీంనగర్ పోలీసులకి ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు సవాల్ గా మరింది. ఈ కేసులో హంతకులెవరో ఇంకా తేలకపోవడంతో పోలీసులు ఈ కేసును ప్రెస్టేజ్ ఇష్ష్యు గా తీసుకున్నారు. సెలవులో ఉన్న సీపీ కమలహాసన్ రెడ్డి సెలవును సైతం రద్దు చేసుకుని కరీంనగర్ వెళ్లారు. హంతకుడు ఎవరో తెలుసుకునేందుకు జర్మన్ టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఈ కేసులో హంతకుడు ఎవరో తేల్చే వరకు 8 బృందాల్లో ఎవరూ సెలవులు పెట్టొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఫోరెన్సిక్, క్రైం బ్రాంచ్ బృందాలు కరీంనగర్ కి వెళ్లాయి. మృతురాలి ఇంట్లో హైదరాబద్ క్లూస్ టీమ్ కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అత్యాధునికమైన జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగించి రక్తం మరకలు ఎలా కడిగారు అనేది తెలుసుకొనే అవకాశం ఉంది. 3D క్రైమ్ సీన్ ఫోటోగ్రఫి, వీడియో గ్రఫీలను ఉపయోగించి ముఖ్యమైన ఆధారాలు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ లాబ్ కు పంపారు. అయితే, జిల్లాలో పోలీస్ బాస్‌ల బదిలీల సమయంలో ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories