Professor Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత..చికిత్స పొందుతూ తుది శ్వాస

Former professor Saibaba passed away while undergoing treatment at NIMS, Delhi
x

PROFESSOR SAIBABA: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత..చికిత్స పొందుతూ తుది శ్వాస

Highlights

Professor GN Saibaba passed away:ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణించారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Professor GN Saibaba passed away: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మరణించారు. అనారోగ్య సమస్యలతో నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మరణించారు. అనారోగ్య సమస్యలతో వారం క్రితం నిమ్స్ లో చేరిన ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2014లో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

2017లో సాయిబాబాకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు 9ఏళ్ల పాటు జైల్లోనే గడిపారు. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్ పూర్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఈ లోకాన్నే విడిచారు.

రచయిత, మానవ హక్కుల కార్యకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ సాయిబాబా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం. పోలీయో సోకి 5ఏండ్ల వయస్సులోనే రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జైలులో ఖైదీల స్థితిగతులపై కూడా సాయిబాబా గళం విప్పిన ధీశాలిగా ఎంతో గుర్తింపు పొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories