Delhi UPSC Coaching Center :విషాదం..యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ బేస్‎మెంట్‎లోకి వరదనీరు..ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి

Flood water entered the basement of UPSC coaching center..Three civil candidates died
x

Delhi UPSC Coaching Center :విషాదం..యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ బేస్‎మెంట్‎లోకి వరదనీరు..ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి

Highlights

Delhi UPSC Coaching Center :ఢిల్లీలో విషాదం నెలకొంది. భారీ వర్షం కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు వచ్చింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ సర్వీస్ కోచింగ్ అభ్యర్థులు మరణించారు. వారిలో ఇద్దరు మహిళా అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

Delhi UPSC Coaching Center :ఢిల్లీలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపింది. సెంట్రల్ ఢిల్లీలోని ఓ సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లోకి భారీగా వరద నీరు వచ్చింది. కోచింగ్ సెంటర్ భవనం బేస్ మెంట్లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ముగ్గురి డెడ్ బాడీలను వెలికి తీశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం కోచింగ్ సెంటర్ బేస్ మెంట్లో ఉన్న లైబ్రరీలో చదువుతుండగా..ఒక్కసారిగా వరద పోటెత్తినట్లు తెలుస్తోంది.

పలువురు అభ్యర్థులు తాళ్ల సాయంతో రక్షించారు. శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓల్డ్ రాజిందర్ నగర్ లో ఉణ్న ఐఏఎస్ స్టడీ సెంటర్ ఈ ఘటన జరిగింది. వెంటనే 5 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి డెడ్ బాడీలను వెలికితీసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

మరోవైపు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్​ సెంటర్ ఎదుట ఆందోళనలకు దిగారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పది నిమిషాల పాటు వర్షం కురిసినా ఇక్కడ నీరు నిలిచిపోతుందని వాపోయారు. గత 12 రోజులుగా డ్రైనేజీని శుభ్రం చేయాలని కౌన్సిలర్​ను కోచింగ్ సెంటర్ యజమాని అడుగుతున్నానని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్​డీఆర్​ఎఫ్​ వాళ్లు 8-10మంది వరకు చనిపోయారని చెబుతున్నారని... మృతుల సంఖ్య, ఎంతమంది గాయపడ్డారో మాకు చెప్పాలంటూ' విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories