Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి మృతి..

Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి మృతి..
x

Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి మృతి..

Highlights

Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ దగ్గర కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ...

Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ దగ్గర కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు చెరువులో మునగడంతో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. వారి డెడ్ బాడీలను వెలికి తీశారు. వీరంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 6గురు యువకులు ఉన్నారు. చెరువులో నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.

హైదరాబాద్‌ నుంచి భూదాన్‌ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసు లోపు వారే. శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి వీరు బయలుదేరినట్లు సమాచారం. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూదాన్‌ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories