10ఏళ్లలో 70వేల ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించిన వైద్యుడు...కటకటాలపాలు

10ఏళ్లలో 70వేల ఆపరేషన్లు చేసి  రికార్డు సృష్టించిన  వైద్యుడు...కటకటాలపాలు
x
Highlights

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓంపాల్ శర్మఅనే వ్యక్తి వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ అతను తప్పుదారిని ఎంచుకున్నాడు. ఫేక్ ఎంబీబీఎస్ పత్రాలు సృష్టించి డాక్టర్ రాజేశ్‎గా పేరు మార్చుకున్నాడు. తనది బెంగళూరుకి చెందిన వాడిగా, కర్ణాటక మెడికల్ కౌన్సిల్‎లో పేరు నమోదు చేసుకున్నాడు.

10ఏళ్లలో 70వేల ఆపరేషన్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు ఓ వైద్యుడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే.. ఇంతకి ఆ డాక్టర్ కథ ఎంటో చూద్దాం...

"నేను కూడా చిన్నప్పుడు మా నాన్నలా డాక్టర్ కావాలని ఆశ పడ్డా అని ఓ కామెడియన్ అంటే.. వెంటనే హీరో మీ నాన్న డాక్టరా? ఎప్పుడు చెప్పలేదు అంటాడు. ఆ హస్యనటుడు బదులు ఇస్తూ.. లేదు మా నాన్న కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆవపడ్డాడు అంటాడు!"... మీకు ఆర్థమైందా...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓంపాల్ శర్మఅనే వ్యక్తి వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ అతను తప్పుదారిని ఎంచుకున్నాడు. ఫేక్ ఎంబీబీఎస్ పత్రాలు సృష్టించి డాక్టర్ రాజేశ్‎గా పేరు మార్చుకున్నాడు. తాను బెంగళూరుకి చెందిన వాడిగా, కర్ణాటక మెడికల్ కౌన్సిల్‎లో పేరు నమోదు చేసుకున్నానని చెప్పుకోసాగాడు.

ఇక స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు డాక్టర్‎గా కూడా పని చేశాడు. అంతాబాగానే నడిచింది ఇంతలో రాజేశ్ అలియాస్ ఓంపాల్ శర్మ కథ అడ్డం తిరిగింది. స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిని నిర్వహిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద ఆస్పత్రిని నమోదు చేయించాలని అనుకున్నాడు. అందుకు దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తులో 70వేలపైగా ఆపరేషన్లు చేసినట్లు పత్రాలు సమర్పించాడు. అనుమానం వచ్చిన అధికారులు డాక్టర్ రాజేష్‎ను విచారించారు. దీంతో రాజేశ్ అసలు డాక్టర్ కాదని వైద్యుడిగా చాలమణి అవుతున్నాడని తెలిసింది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు. రాజేశ్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజేశ్ డాక్టర్ కాదనీ తెలియడంతో... అతని దగ్గరకు వైద్యం చేయించుకున్న రోగులు ఆందోళన చెందుతున్నారు. వైద్య వృత్తిని అడ్డం పెట్టుకుని జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారికి శిక్షించాని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories