Uttar Pradesh : హత్రాస్ ఘటనలో 116కు చేరిన మృతుల సంఖ్య..విచార‌ణ‌కు సీఎం యోగి ఆదేశం

Uttar Pradesh : హత్రాస్ ఘటనలో 116కు చేరిన  మృతుల సంఖ్య..విచార‌ణ‌కు సీఎం యోగి ఆదేశం
x

Uttar Pradesh : హత్రాస్ ఘటనలో 116కు చేరిన మృతుల సంఖ్య..విచార‌ణ‌కు సీఎం యోగి ఆదేశం

Highlights

Uttar Pradesh : యూపీలోని హత్రాస్ జిల్లా రతిభాన్పూర్ లో భక్తులతో కోలాహలంగా మారిన భక్తి కార్యక్రమంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. హత్రాస్ జిల్లాలో జరిగిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానకి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. 116 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం యోగి విచారణకు ఆదేశించారు.

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు 116 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ బాబా సత్సంగ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 116 మంది భక్తులు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. మరణించినవారిలో పాతిక మందికిపైగా మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఇద్దరు మంత్రులతో పాటు డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులను హత్రాస్ ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆగ్రా అడిషనల్ డీజీపీ, అలీగఢ్ పోలీస్ కమిషనర్ లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఇంకొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని యూపీ పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి ప్ర‌త్య‌క్ష సాక్షి మాట్లాడుతూ.. శివ ఆరాధ‌న కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఒక్కటే దారి ఉంది. అది కూడా చిన్న గేటు కావడంతో బయటకు వెళ్లేందుకు వీల్లేకుండా పోయింది. ఆ చిన్న గేటులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఒకేసారి అంద‌రూ ప్ర‌య‌త్నించారు. గేటు బ‌య‌టనే బైక్‌లు పార్క్ చేశారు. దీంతో మ‌రింత ఇబ్బందిగా మారింది. మొత్తం దారి మూసుకుపోయింది. ఈ క్రమంలోనే తొక్కిస‌లాట జ‌రిగింది అని స‌ద‌రు వ్య‌క్తి తెలిపాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories