Child Trafficking Case: పసిపిల్లలను అక్రమ రవాణా కేసులు విస్తుపోయే నిజాలు

Child Trafficking Case: పసిపిల్లలను అక్రమ రవాణా కేసులు విస్తుపోయే నిజాలు
x
Highlights

Child Trafficking Case: యునివర్శల్ సృష్టి పసికందుల అక్రమ అమ్మకాలు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సృష్టి ఆస్పత్రి తీగలాగితే డొంకంతా...

Child Trafficking Case: యునివర్శల్ సృష్టి పసికందుల అక్రమ అమ్మకాలు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సృష్టి ఆస్పత్రి తీగలాగితే డొంకంతా కదులుతుంది. సృష్టి ఆసుపత్రిలో స్వాధీనం చేసుకున్న రికార్డులు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు.. విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. విశాఖ పసిపిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు స్పీడ్‌ పెంచారు. దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నాయి.

విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం పోలీసులు గుట్టరట్టు చేసారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నమ్రత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. చైల్డ్‌లైన్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు విచారణ చేసిన పోలీసులు.. సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రతతో పాటు ఇద్దరు ఆశా వర్కర్లను, ఏజెంట్‌గా వ్యవహరించిన రామకృష్ణను, ఆస్పత్రి ఎండీ దగ్గర పనిచేస్తున్న వైద్యురాలు తిరుమలను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో దర్యాప్తు చేసి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీన పరుచుకున్నారు.

నమ్రత విశాఖలో 2010 సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ప్రారంభించారు. పసిపిల్లలను విక్రయించడం, ఇతరత్రా విషయాలపై ఆమెపై 2018లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి పేరును యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌గా మార్చారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో నాలుగు బ్రాంచ్‌లు ప్రారంభించారు. ఆస్పత్రి ఎండీ నమ్రత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాకుండా ఒడిశా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవారు.

ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతలు, అక్రమ సంబంధాల ద్వారా కలిగే గర్భవతుల వివరాలను తెలుసుకునేవారు. ఆశా వర్కర్లనే ఆ బాలింతల దగ్గరకు వెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, ఆ బిడ్డలను ఆస్పత్రికి ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్‌ నమ్రత తన నెట్‌వర్క్‌ను విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలింతలకు డెలివరీ చేసి ఆ పసికందులను డబ్బున్న వారికి విక్రయించడాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు.

డాక్టర్‌ నమ్రత పోలీసులకు దొరక్కుండ చుక్కలు చూపించింది. కేసు బయటపడగానే విజయవాడ పరారైంది. అక్కడి నుంచి హైదరాబాద్, కర్ణాటకకి మకాం మార్చింది. ఆమె సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా దావణగిరిలో అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అయితే తనకు కరోనా ఉందంటు ఆరోగ్యం బాలేదంటు కేసు నుండి బయట పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రిమాండ్ విధించిన తరవాత ఆమెను సెంట్రల్ జైలుకు పంపారు.

సృష్టి అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 8 మంది పసిపిల్లలను విక్రయించినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో తనిఖీలు చేసి పలు కీలక డ్యాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సృష్టి ఆస్పత్రితో పాటు నగరంలో ఉన్న మరికొన్ని ఆస్పత్రుల ద్వారా కూడా పసికందుల అక్రమ రవాణా జరిగినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కొన్ని ఆసుపత్రులుతో నమ్రతా లింక్ పెట్టుకుంది. దీనితో ఆయా ఆసుపత్రుల్లో డెలవరీ చేసి బిడ్డలను నమ్రతాకు అప్పగించేవారు. అయితే ఇదంతా తెలిసి చేసారా లేక వీరి పాత్ర ఎంటి అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories