ఆచూకి తెలియకుండా పోతున్న బాలికలు...దేశ వ్యాప్తంగా ప్రతి పది నిమిషాలకు ఓ చిన్నారి కిడ్నాప్‌..!

ఆచూకి తెలియకుండా పోతున్న బాలికలు...దేశ వ్యాప్తంగా ప్రతి పది నిమిషాలకు ఓ చిన్నారి కిడ్నాప్‌..!
x
Highlights

అడుగుకో సీసీ కెమెరా, అందుబాటులో అత్యాధునిక టెక్నాలజీ క్షణాల్లో ఆచూకి తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం రెప్పపాటులో సమాచార మార్పిడి ఇన్ని అవకాశాలున్నా...

అడుగుకో సీసీ కెమెరా, అందుబాటులో అత్యాధునిక టెక్నాలజీ క్షణాల్లో ఆచూకి తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం రెప్పపాటులో సమాచార మార్పిడి ఇన్ని అవకాశాలున్నా చిన్నారుల కిడ్నాప్‌లు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఏటికి ఏడు చిన్నారుల కిడ్నాప్‌లు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 2014లో 37 వేల 854 మంది చిన్నారులు కిడ్నాప్‌ కాగా 2015లో ఈ సంఖ్య 41 వేల 893కు చేరుకుంది. ఇక 2016 నాటికి ఏకంగా 30 శాతం పెరిగి 54 వేల 723కు చేరుకుంది. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా ప్రతి పది నిమిషాలకు ఓ చిన్నారి కిడ్నాప్‌కు గురవుతున్నారు. వీరిలో అధిక శాతం చిన్నారుల ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా జరుగుతున్న కిడ్నాపుల్లో రాష్ట్రం ఆరో స్ధానంలో నిలుస్తోంది. రాష్ట్రంలో ముద్దులొలికించే చిన్నారులు రాత్రికి రాత్రి మాయమవుతున్నారు. అక్షర జ్ఞానం పాఠశాలలకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకుండానే మాయమవుతున్నారు. గుడికి వెళ్లిన ఆడపిల్లలు దేవుడి దర్శనం చేసుకోకుండానే ఆచూకి దొరక్కుండా పోతున్నారు. తెలంగాణ గడచిన మూడేళ్లలో ఆచూకి తెలియకుండా పోయిన చిన్నారుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. కిడ్నాప్‌ల సంఖ్యతో పాటు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు పోలీస్ శాఖకు సవాల్ విసురుతోంది.

జాతీయ నేర గణాంక సంస్ధ (NCRB) వివరాల ప్రకారం 2016లో 3 వేల 679 మంది చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఇందులో 2 వేల 2 వందల 77 మంది ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో 581 మంది ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదు. ఇదే సమయంలో 522 అబ్బాయిల జాడ కూడా తెలియలేదు. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 477 మంది అపహరణకు గురయ్యారు. 2017లో తెలంగాణ వ్యాప్తంగా 681 చిన్నారుల ఆచూకి తెలియలేదు. ఇందులో 259 అబ్బాయిలు ఉండగా, 422 మంది బాలికలు ఉన్నారు. అపహరణ కేసులు అత్యధికంగా రాజధాని హైదరాబాద్‌ పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయి. నగరం పరిధిలో మొత్తం 256 మంది చిన్నారులు అపహరణకు గురి కాగా 112 అబ్బాయిలు, 144 మంది అమ్మాయిలు ఉన్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా చిన్నారుల కిడ్నాప్ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తప్పిపోయిన తమ చిన్నారుల ఆచూకి కోసం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి కిడ్నాప్‌ల నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వార క్షణాల్లో సమాచారం సేకరించే ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు విస్త్రతమైన నెట్‌ వర్క్‌, క్షణ్ణాల్లో స్పందించే సిబ్బంది, టెక్నాలజీ వినియోగంలో అగ్రస్ధానం ఉండటం ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి అపహరణకు గురైన చిన్నారి కేసును విజయవంతంగా చేధించి జాతీయ స్ధాయిలో తమ సత్తాను కూడా చాటారు .అయితే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న కిడ్నాప్‌లు, అక్కడక్కడా ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.

చిన్నారుల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. వ్యభిచారం, వెట్టి చాకిరి, భిక్షగాల్లుగా మార్చడం వంటి ఘటనలకు పాల్పడుతున్నాయి. అయితే అక్కడక్కడా పోలీసుల నిర్లక్ష్యం కిడ్నాప్‌ అయిన చిన్నారుల జీవితాల పాలిట శాపంగా మారుతోంది. హాజీపూర్ ఘటనలో చిన్నారి కల్పన విషయంలో ఇదే జరిగింది. కల్పన కిడ్నాప్ విషయంలో పోలీస్ తగిన విధంగా స్పందించలేకపోయారు. కేసు మూసివేసిన ఏడాది తరువాత అనుకోకుండా ఈ ఘటన వెలుగు చూడటంతో పోలీసుల వైఫల్యం బయటపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories