సూట్‌కేసులో కుక్కి.. కాలువలో పడేసి..

సూట్‌కేసులో కుక్కి.. కాలువలో పడేసి..
x
Highlights

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య హత్య కేసు మిస్టరీని ఆర్‌సీ పురం పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్‌ కుమార్‌ హత్య చేసినట్లు గుర్తించారు....

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య హత్య కేసు మిస్టరీని ఆర్‌సీ పురం పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్‌ కుమార్‌ హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు నిందితుడు సునీల్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి విషయమై లావణ్య సునీల్‌పై ఒత్తిడి తెస్తుండటంతో అడ్డుతొలగించుకోవటానికే ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి లావణ్య హత్య కేసు మిస్టరీ వీడింది. లావణ్య ప్రియుడు సునీల్ హత్యచేసి శవాన్ని సూట్ కేసులో పెట్టి సూరారం దగ్గరలోని ఓ కాలవలో వదిలేసి వెళ్ళాడు. స్థానికులు సూట్ కేసును గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు కేసును విచారించారు. ప్రియుడు సునీల్ మరో స్నేహితుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేల్చారు.

సునీల్-లావణ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య పెళ్లి గురించి పలుమార్లు అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఆమె అడ్డుతొలిగించుకోవాలనుకున్న సునీల్‌ ఓ హోటల్‌కు రమ్మని, అక్కడ మాట్లాడుకుందామని నమ్మబలికాడు. అక్కడికి వెళ్లిన లావణ్యను అతికిరాతకంగా చంపేశాడు. అనంతరం డెడ్‌బాడీని సూట్‌కేసులో తీసుకెళ్లి సూరారం వద్ద నాలాలో పడేశాడు.

అయితే, రెండు రోజులుగా లావణ్య కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్ళికి మనసొప్పని సునీల్ ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి వదిలించుకోవాలని చూసి ఆఖరికి అడ్డంగా బుక్కయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories