Radhika Sarath Kumar: హీరోయిన్లు దుస్తులు మార్చుకునే వ్యాన్లలో స్పై కెమెరాలు పెడతారు.. సరికొత్త బాంబు పేల్చిన నటి రాధికా శరత్ కుమార్
Radhika Sarath Kumar: ప్రముఖ నటి సీనియర్ నిర్మాత రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థతో జరిపిన సంభాషణలో మాట్లాడుతూ మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్న హేమా కమిటీ రిపోర్టు కేవలం మలయాళం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదన్నారు.
Radhika Sarath Kumar: ప్రముఖ నటి సీనియర్ నిర్మాత రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థతో జరిపిన సంభాషణలో మాట్లాడుతూ మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్న హేమా కమిటీ రిపోర్టు కేవలం మలయాళం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. అంతకుమించిన ఘటనలు తెలుగు, తమిళ పరిశ్రమల్లో కూడా చోటు చేసుకున్నాయని ఆమె పేర్కొన్నారు.
అంతటితో ఆగలేదు హీరోయిన్లు డ్రెస్ చేంజ్ చేసుకునే వానిటీ వాన్లలో కూడా స్పై కెమెరాలు పెట్టి వారి నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తారని ఆమె ఈ సందర్భంగా బాంబు లాంటి వార్త పేల్చారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది సినీ ఇండస్ట్రీలోని పెద్దలు సైతం ఇలాంటి వీడియోలను మొబైల్ ఫోన్లలో చూసి ఆనందిస్తున్న పొందుతున్న ఘటన తాను కళ్ళారా చూశానని రాధికా శరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ హేమ కమిటీ ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయని కానీ ఇది కేవలం మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్య మాత్రమే కాదన్నారు. తెలుగు తమిళ పరిశ్రమల్లో కూడా ఇలాంటి సంఘటనలను హీరోయిన్లు ఇతర మహిళా ఆర్టిస్టులు ఫేస్ చేస్తున్నారని ఆమె కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు .
తాను ఇండస్ట్రీలో 46 సంవత్సరాలుగా కొనసాగుతున్నానని ఇలాంటి ఘటనలను తాను కోకొల్లలుగా చూసినట్లు వీటి పై నోరు మెదిపి బయటికి చెప్పేందుకు మహిళలు వెనకాడుతున్నట్లు ఆమె వ్యక్తం చేశారు. అయితే మలయాళ చిత్ర పరిశ్రమలో హేమా కమిటీ రిపోర్ట్ అనంతరం ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ ప్రకంపనలు ప్రస్తుతం ఇతర చలనచిత్ర పరిశ్రమలకు సైతం తాకే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు వారిపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని ఈ సందర్భంగా రాధికా శరత్ కుమార్ డిమాండ్ చేశారు.
సినీ పరిశ్రమలో మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అమానుషమని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది పురుష టెక్నీషియన్లు నటులకు చెందిన మొబైల్ ఫోన్లలో హీరోయిన్ల పేరిట ఫోల్డర్లు ఉంటాయని ఆ ఫోల్డర్లలో ఆయా నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు ఉంటాయని వాటిని చూసినప్పుడు భయంతో వణికిపోయానన్నారు. అప్పటినుంచి తాను కేరవాన్లు ఉపయోగించడం మానేశానని తనకు దుస్తులు మార్చుకోవాలనుకున్నప్పుడు సమీపంలో ఉన్న హోటల్ కు వెళ్లి ఆ పని చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అయితే రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో దుమారాన్ని రేపన్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire