బేరం కుదిరింది భర్తను రూ.5లక్షలకు ప్రియురాలికి అమ్మేసింది !
కర్ణాటకలో జరిగిన వింత వింటే మాత్రం ఆడోళ్ళు మహా ముదురులు అనుకుని తీరుతారు. ఎందుకంటే, ఒక మహానుభావుడు ఒకామె వద్ద అప్పు తీసుకున్నాడు. అది తీర్చలేకపోయాడు. దీంతో సదరు వనితామణి ఇతగాడితో శారీరక సంబంధం పెట్టుకుంది
కట్టుకున్నోడు తనతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడంటేనే మహిళలకి ఒళ్ళు మండిపోతుంది. ఇక వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిస్తే అపార కాళికలవుతారు. ఇటు భర్తనీ.. అటు తన భర్తని లోబర్చుకున్న(?) ఆమెనీ కూడా చితక్కొట్టేస్తారు. కానీ, కర్ణాటకలో జరిగిన వింత వింటే మాత్రం ఆడోళ్ళు మహా ముదురులు అనుకుని తీరుతారు. ఎందుకంటే, ఒక మహానుభావుడు ఒకామె వద్ద అప్పు తీసుకున్నాడు. అది తీర్చలేకపోయాడు. దీంతో సదరు వనితామణి ఇతగాడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇదిలా ఉంటె అతని భార్యకు తన భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దీంతో ఇద్దర్నీ నిలదీసింది. అప్పుడేం జరిగిందో వినండి. ఇది చదివాకా మీరు ముక్కుమీద వేలు వేసుకోవడం ఖాయం!
కర్ణాటక రాష్ర్టం లో జరిగిన ఈ సంఘటన అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.. వివరాల్లోకి వెళ్తే... మాండ్య జిల్లాలో ఓ గ్రామానికి చెందిన దంపతుల దాంపత్యానికి డబ్బు చిచ్చు పెట్టింది. వారుంటున్న ఆదే గ్రామంలో మరో మహిళతో ఆమె భర్తకు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, భర్త కొన్నాళ్లుగా ఇంటికి సరిగ్గా రాకపోవడం అనుమానం వచ్చి నిలదీయగా అసలు విషయం బయటపడింది.
తన భర్త భాగోతం వెలుగులోకి తెచ్చిన ఇల్లాలు పెద్దల ముందు పంచాయితీ పెట్టింది. పెద్దలు కూడా ఆమె భర్తను అతనితో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రియురాలిని హెచ్చరించారు. కాగా.. కొన్నాళ్ల పాటు అతను ఇంటిపట్టునే ఉన్నాడు. అయినప్పటికీ అతని బుద్ధి మారలేదు ఒకట్రెండు రోజులు మాత్రమే భార్యతో ఉంటున్నాడు. మళ్లీ తన ప్రియురాలి వద్దకు వెళ్తున్నాడు. దంపతుల మధ్య చాలా పంచాయతీలు నడిచినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల తన భర్త ప్రియురాలితో రాసలీలలు పకడ్భందీగా పట్టుకొని నిలదీసింది.
దీంతో అతడి భార్యకు, ప్రియురాలికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తన భర్తను విడిచిపెట్టాలని కోరింది. కాగా.. అతడిని వదిలేందుకు ప్రియురాలు ఒప్పుకోలేదు. తన భర్త నా వద్ద రూ.5లక్షలు అప్పు తీసుకుని చాలా కాలం దాటిందని అతను తిరిగి చెల్లించలేదని తెలిపింది. అందుకు ప్రతిఫలంగానే లైంగిక దగ్గర అయ్యాడని తెలిపింది. భర్త కావాలంటే రూ.5లక్షలు చెల్లించి తీసుకెళ్లాలని ప్రియురాలు చెప్పింది. అంత డబ్బు తన వద్ద లేదని, భర్తను శాశ్వతంగా ఆమెకు వదిలేస్తే ఎంత డబ్బు ఇస్తావో చెప్పాలని కోరింది. దీంతో మొదట ప్రియురాలు షాకుకు గురైయింది. ఇద్దరి మధ్య చర్చలు తర్వాత 5లక్షల రూపాయిలకు బేరం కుదిరింది. నవంబర్17వ తేదీన డబ్బులు చెల్లిస్తానని, భర్త కట్టిన తాళిని కూడా తీసి తనకిచ్చేయాలని చెప్పింది. దీంతో ఆ మహా ఇల్లాలు భర్తను అమ్మకానికి అంగీకరించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire