మాజీ ప్రధాన న్యాయమూర్తి వేధింపుల వీడియో బయటపెట్టిన కోడలు

మాజీ ప్రధాన న్యాయమూర్తి వేధింపుల వీడియో బయటపెట్టిన కోడలు
x
Highlights

తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రామ్మోహన్ రావు కుటుంబ కలహాలు మరోసారి బయటపడ్డాయి. కోడలు సింధు శర్మ సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సందర్భంగా తన వాదన నిజం అని నిరూపించుకునేందుకు తాజాగా ఆమె వీడియో విడుదల చేశారు.

తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రామ్మోహన్ రావు కుటుంబ కలహాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో డబ్బుకోసం, అదనపు కట్నం కోసం తన భర్తకు ఆయన తండ్రి మరో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని… తనను శారీరకంగా, మానసికంగా హింసించారని కోడలు సింధు శర్మ సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సందర్భంగా తన వాదన నిజం అని నిరూపించుకునేందుకు తాజాగా ఆమె వీడియో విడుదల చేశారు. ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"వరకట్న వేధింపులు మామూలుగా చదువుకోని వారి ఇళ్లలో చూస్తుంటాం. కానీ… ఓ చీఫ్ జస్టిస్ ఇంట్లో ఇలాంటి వేధింపులు , దాడులు చూడటం దారుణం"అంటూ సోషల్ మీడియా యూజర్స్ స్పందిస్తున్నారు. గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి.. చికిత్స పొందారు సింధు శర్మ. పెద్ద కూతురైన రిషితను సింధు శర్మకు అప్పగించాలని గతంలో మే నెలలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories